AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉండాలంటే.. రోజూ ఎంత సేపు, ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?

శరీర బరువు తగ్గించుకోవడానికి నడక మంచి మార్గం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా బాడీ ఫిట్ నెస్ తో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని తయారు చేసుకోవచ్చు.

Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం.. ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉండాలంటే.. రోజూ ఎంత సేపు, ఎన్ని అడుగులు నడవాలో తెలుసా..?
Walking
Shaik Madar Saheb
|

Updated on: Aug 31, 2022 | 7:51 PM

Share

Weight Control Tips: పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఈ రోజుల్లో బరువు పెరగడం అనే సమస్య సర్వసాధారణంగా మారింది. శరీర బరువు తగ్గించుకోవడానికి నడక మంచి మార్గం అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా బాడీ ఫిట్ నెస్ తో పాటు మెరుగైన ఆరోగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే, ఫిట్‌గా ఉండటానికి మనం రోజూ ఎంతసేపు నడవాలి అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంటుంది. అయితే, ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి ఎంతసేపు నడవాలి.. ఎప్పుడెప్పుడు వాక్ చేయాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్ని నిమిషాలు నడిస్తే ఫిట్‌గా ఉండొచ్చు..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీర బరువును తగ్గించి, శరీరాన్ని మంచి ఆకృతికి తీసుకురావాలంటే ప్రతిరోజూ కనీసం 3 సార్లు 20-20 నిమిషాలు నడవాలి. రక్తపోటు ఎక్కువగా లేదా తక్కువగా ఉన్న వ్యక్తులకు ప్రతిరోజూ 3 సార్లు నడక దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాంటి వారు ఒక గంట పాటు ఒకేసారి నడవడానికి బదులుగా.. దానిని పార్ట్ పార్టులుగా చేసి రోజుకు 3 సార్లు నడవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు.

ఇవి కూడా చదవండి

బరువును అదుపులో ఉంచుకోవడానికి రోజుకు ఎన్ని అడుగులు నడవడం సరైనది..? అనే ప్రశ్న అందరి నుంచి వస్తుంది. అయితే, బరువును అదుపులో ఉండాలంటే రోజూ దాదాపు 15,000 అడుగులు నడవడం సరైనదని వైద్య నిపుణులు చెబుతున్నారు. నడుస్తున్నప్పుడు దీనిని కూడా లెక్కించాల్సిన అవసరం లేదు. దానికి బదులు.. ఎక్కువ సేపు నడవాల్సిన ఆలోచనను మైండ్‌లో ఉంచుకోవాలి. దీని కోసం సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. ఉదయం నిద్ర లేచిన నాటినుంచి ఎక్కడికి వెళ్లినా నడుచుకుంటూ వెళ్లడం ద్వారా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చు.

లిఫ్ట్ నివారించండి..

ప్రస్తుతం అందరికీ సౌకర్యవంతమైన సౌలభ్యాలు అందుబాటులో ఉన్నాయి. చాలామంది రెండో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ను ఉపయోగిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచి ఫిట్ నెస్ కావాలంటే ముందుగా ఈ అలవాటును మార్చుకోవాలి. మెట్ల ద్వారా వెళ్లండి.. తక్కువ దూరం ప్రయాణించడానికి వాహనాన్ని ఉపయోగించకుండా కాలినడకన లేదా సైకిల్‌పై వెళ్లడానికి ప్రయత్నించండి. ఎటువంటి కారణం లేకుండా రోజుకు 2-3 సార్లు ఇంట్లో మెట్లు ఎక్కి దిగండి. ఇలా చేయడం వల్ల మీ శరీరానికి మంచి వ్యాయామం అందుతుంది.

ఎత్తైన ప్రదేశాలలో నడవండి..

శరీర బరువు పెరగడం వల్ల ఇబ్బంది పడుతుంటే కొంచెం ఎత్తులో ఉండే ప్రదేశాలలో నడవడానికి ప్రయత్నించండి.. పార్కులు, స్టేడియం మెట్లు, ఫ్లైఓవర్, కాలిబాటలతో నిర్మించిన కృత్రిమ కొండలపై నడక కోసం వెళ్ళవచ్చు. ఎత్తుపైకి నడిచేటప్పుడు శరీరంపై ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా కేలరీలు వేగంగా కరిగిపోతాయి. దీంతో శరీర బరువు తగ్గడం ప్రారంభమవుతుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి