Viral Video: ఇదెక్కడి విడ్డూరం రా బాబు.. పరీక్షల్లో ఫెయిల్ చేశారని టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు.. షాకింగ్ వీడియో

ప్రాక్టికల్స్‌లో తక్కువ మార్కులు వేశారన్న కోపంతో విద్యార్ధులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులు స్కూల్‌కు చేరుకున్నారు

Viral Video: ఇదెక్కడి విడ్డూరం రా బాబు.. పరీక్షల్లో ఫెయిల్ చేశారని టీచర్లను చెట్టుకు కట్టేసి కొట్టిన విద్యార్థులు.. షాకింగ్ వీడియో
Jharkhand
Follow us
Shaik Madar Saheb

| Edited By: Ravi Kiran

Updated on: Aug 31, 2022 | 6:03 PM

School teacher thrashed by students : జార్ఖండ్‌ లోని దుమ్కాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లో విద్యార్ధులు రెచ్చిపోయారు. పరీక్షల్లో మార్కులు తక్కువ వేశారని టీచర్లనే చితకబాదారు. టీచర్లను చెట్టుకు కట్టేసి విద్యార్ధులు వారిపై దాడి చేశారు. దుమ్కా జిల్లా గోపికందర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 9వ తరగతి విద్యార్ధులు ఈ దాడులకు పాల్పడ్డారు. ప్రాక్టికల్స్‌లో తక్కువ మార్కులు వేశారన్న కోపంతో విద్యార్ధులు దాడి చేశారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఉన్నతాధికారులు, పోలీసులు స్కూల్‌కు చేరుకున్నారు. అప్పటికే ఇతర టీచర్లు విద్యార్ధులను విడిపించారు. ప్రాక్టికల్స్‌ మార్కులు కలపకముందే విద్యార్ధులు తమకు తక్కువ మార్కులు వేశారని అపోహ చెందారని టీచర్లు చెబుతున్నారు. కాగా.. హాస్టల్‌లో పోలీసులు తనిఖీలు చేశారు. విద్యార్ధుల దగ్గరి నుంచి సెల్‌ఫోన్లను సీజ్‌ చేశారు. హాస్టల్‌లో భోజనం సరిగ్గా లేదని కూడా అధికారులకు విద్యార్ధులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జార్ఖండ్‌ ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

ప్రాక్టికల్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినందుకు స్కూల్ విద్యార్థులు గణిత ఉపాధ్యాయుడిని, పాఠశాల క్లర్క్‌ను చెట్టు కిందకు తాడుతో కట్టివేసి కొట్టినట్లు అధికారులు తెలిపారు. ఉపాధ్యాయుడిని సుమన్ కుమార్‌, క్లర్క్ సోనేరామ్ చౌరే గా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఉద్దేశపూర్వకంగా తమకు తక్కువ మార్కులు వేశారని.. ఫలితంగా 11 మంది ఫెయిల్ అయ్యామని విద్యార్థులు ఆరోపించారు. మొత్తం 36 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, అందులో 11 మంది ఫెయిల్ అయ్యారు.

వైరల్ వీడియో..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటగ వైరల్ అవుతోంది. పలువురు దీనిపై రియాక్ట్ అవుతూ.. విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..