Sago Benefits: సగ్గుబియ్యంతో ఊబకాయానికి చెక్.. ఇలా తీసుకుంటే కొవ్వు వెన్నలా కరిగిపోతుందట..
సగ్గుబియ్యం (Sago) తీసుకోని సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.. సగ్గుబియ్యంలో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.
Weight Loss Tips: ఉరుకుపరుగుల జీవితంలో చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బరువు తగ్గడం అనేది ఒక సవాలుగా మారింది. పనిలో బిజీగా ఉండేవారు ఆకలిగా అనిపించినప్పుడు అనారోగ్యకరమైన వాటిని తింటారు. అలాంటివారు.. సగ్గుబియ్యం (Sago) తీసుకోని సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.. సగ్గుబియ్యంలో ప్రొటీన్, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు క్యాలరీల పరిమాణం కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో సగ్గుబియ్యం బరువు తగ్గడానికి, అలానే ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు తగ్గడానికి ప్రొటీన్లు సమృద్ధిగా ఉండే సగ్గుబియ్యం తినండి..
చాలా సార్లు మనం బరువు తగ్గే సమయంలో ప్రోటీన్‌లను ఆహారంలో చేర్చుకోలేకపోతున్నాం. ఇది మన బరువును తగ్గిస్తుంది. కానీ ఇది లోపల నుంచి మనల్ని బలహీనంగా చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆహారంలో సగ్గు బియ్యం (సాబుదానా) ను చేర్చుకుంటే.. ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు.
మలబద్ధకం సమస్య దూరం: బరువు తగ్గేటప్పుడు చాలా మంది కడుపు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితిలో సగ్గు బియ్యాన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. దీని కోసం సగ్గు బియ్యం గంజి, లేదా ఖిచిడిని చేసుకొని తినవచ్చు. అదే సమయంలో ఇందులో ఉండే ఫైబర్ కడుపు సమస్యలను తగ్గిస్తుంది.
ఆకలిని నియంత్రిస్తుంది: సగ్గుబియ్యం తినడం ద్వారా పదే పదే ఆహారం తినాలనే కోరికను నియంత్రించుకోవచ్చు. ఎందుకంటే సగ్గుబియ్యం రోజంతా శక్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇందులో ఉండే క్యాలరీలు మీ పొట్టను ఎక్కువసేపు నిండుగా ఉంచుతాయి. దీని వల్ల బయటి వస్తువులను తినకుండా నియంత్రించుకోగలుగుతారు. ఇంకా ఊబకాయం కూడా తగ్గుతుంది.
డయాబెటిస్‌లో మేలు చేస్తుంది: సగ్గుబియ్యం ఖిచిడీని తీసుకోవడం మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, ఐరన్ షుగర్ లెవెల్‌ను అదుపులో ఉంచుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం