High Heels Side Effects: హై హీల్స్ వేసుకుని టిప్ టాప్‌గా నడుస్తున్నారా..? అయితే, పెను ప్రమాదంలో పడినట్లే..
ఎత్తు మడమల చెప్పులు సాధారణంగా అవి ధరించేవారి వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. అదే సమయంలో ఇవి పాదాలకు అనేక సమస్యలను కూడా కలిగిస్తాయి..
High Heels Side Effects : చాలా మంది మహిళలు గ్లామరస్, స్టైలిష్ లుక్ కోసం హైహీల్స్ ధరించడానికి ఇష్టపడతారు. పూర్వకాలంలో కేవలం మోడల్స్, నటీమణులు మాత్రమే హైహీల్స్ ధరించేవారు. కానీ నేటి కాలంలో చాలా మంది మహిళలు హైహీల్స్ ధరించడం ప్రారంభించారు. ఎత్తు మడమల చెప్పులు సాధారణంగా అవి ధరించేవారి వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. అదే సమయంలో ఇవి పాదాలకు అనేక సమస్యలను కూడా కలిగిస్తాయి.. చాలా సార్లు, హైహీల్స్ ధరించడం వల్ల ప్రజల సమస్యలు చాలా ఎక్కువ అవుతాయి. అలాంటి వారి పాదాలకు ప్రమాదంతోపాటు.. పలు సందర్భాల్లో శస్త్రచికిత్స కూడా చేయవలసి ఉంటుంది. మీరు కూడా హైహీల్స్ ధరిస్తుంటే.. వాటిని ధరించడం వల్ల కలిగే నష్టాల గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. హైహీల్స్ ధరించడం వల్ల శరీరానికి కలిగే నష్టాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హైహీల్స్ ధరించడం వల్ల కలిగే నష్టాలు
హైహీల్స్ వేసుకోవడం వల్ల పాదాల నొప్పితో పాటు మోకాళ్ల నొప్పుల సమస్య కూడా వస్తుంది. ఇది కాకుండా అనేక రకాల సమస్యలు సంభవించవచే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.
కాళ్ల నొప్పులు: గంటల తరబడి హైహీల్స్ ధరించడం వల్ల పాదాల్లో నొప్పి సమస్య రావచ్చు. వాస్తవానికి హైహీల్స్ ధరించడం వల్ల కండరాలపై ఒత్తిడి కలుగుతుంది. దీని కారణంగా పాదాల నొప్పితో పాటు చీలమండలు, నడుము, తుంటిలో నొప్పి ఉంటుంది.
మోకాళ్లలో నొప్పి: హైహీల్స్ ధరించడం వల్ల వెన్నెముక ఎముకలపై ఒత్తిడి పడుతుంది. ఇది మోకాళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు చాలా రోజులు లేదా గంటలు తరబడి నిరంతరంగా హై హీల్స్ ధరిస్తే.. దీని కారణంగా మోకాలి నొప్పి సమస్య వస్తుంది.
ఎముకలు విరిగిపోయే ప్రమాదం: హైహీల్స్ ధరించడం వల్ల కూడా ఫ్రాక్చర్లు వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల కాళ్లు, నడుము, తుంటి ఎముకలు విరిగిపోతాయి. ఇది కాకుండా శరీర భంగిమ కూడా చెడుగా ఉంటుంది. కావున, ఎముకలు బలహీనంగా ఉంటే హైహీల్స్ ధరించేముందు ఆలోచించాలని సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం