Health Tips: ఈ లక్షణాలను తేలిగ్గా తీసుకుంటున్నారా? ప్రాణాంతక వ్యాధులకు సంకేతాలు కావొచ్చు.. తస్మాత్ జాగ్రత్త
శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు వివిధ లక్షణాలను చూపిస్తుంది. కానీ చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. ఏమవుతుందిలే.. అని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్‌లో ప్రాణాంతక వ్యాధులు తలెత్తవచ్చంటున్నారు వైద్య నిపుణులు.
శరీరం అనారోగ్యానికి గురైనప్పుడు వివిధ లక్షణాలను చూపిస్తుంది. కానీ చాలామంది వాటిని తేలికగా తీసుకుంటారు. ఏమవుతుందిలే.. అని పెద్దగా పట్టించుకోరు. అయితే ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్‌లో ప్రాణాంతక వ్యాధులు తలెత్తవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా పెద్దవారు, స్త్రీలలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే ఎలాంటి పరిస్థితుల్లో అలక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు. తగిన సమయంలో స్పందించి ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. మరి అటువంటి కొన్ని ప్రమాదకర సంకేతాలేంటో తెలుసుకుందాం రండి.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
చాలా మంది ఊపిరి తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడుతుంటారు. అయితే దాన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ అది చాలా ప్రమాదకరం. ధమనులు మూసుకుపోవడం వల్ల అసాధారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. ధమణిలో రక్తం ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడినప్పుడు ఇటువంటి పరిస్థితి తలెత్తుతుంది. అటువంటి సమయంలో శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. దీనిని నిర్లక్ష్యం చేస్తే గుండె పోటు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. ఛాతీలో నొప్పి మాత్రమే గుండె పోటుకి సంకేతం కాదు. మైకం, ఛాతిలో బిగుతుగా అనిపించి శ్వాస ఆడకపోవడం కూడా దీనికి ముందస్తు సంకేతాలే.
రొమ్ము వాపు
రొమ్ము గడ్డగా మారిపోవడం, రంగు మారడం, సైజు చిన్నది కావడం కూడా భవిష్యత్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ కి సంకేతాలు కావొచ్చు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదు. అలాగే రొమ్ములు ఉబ్బుగా వాసినట్లు అనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలి.
రక్త స్రావం
మహిళల్లో మెనోపాజ్ వచ్చిన తరువాత కూడా రక్తస్రావం జరుగుతుంటుంది. అలాగే కలయిక తర్వాత కూడా రక్తస్రావం జరుగుతుంటుంది. ఇది రెండూ కూడా ప్రమాదకర సూచనలే. ఒక్కోసారి ఇవి స్త్రీ జననేంద్రియాల క్యాన్సర్ కి దారి తీయవచ్చు. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను కలిసి పరీక్షలు చేయించుకోవాలి.
మలబద్ధకం
మలవిసర్జన సమయంలో అధిక ఒత్తిడి ఉపయోగించాల్సి వస్తే అది హెమరాయిడ్స్ కి కారణం కావచ్చు. దీన్నే పైల్స్ కూడా అని అంటారు. అయితే ఒక్కోసారి మలబద్ధకం సాధారణం కూడా కావచ్చు. కణితి లేదా పాలిప్ వంటి అడ్డంకి ఫలితంగా కూడా మలబద్ధకం ఏర్పడవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి