Salt: మోతాదుకు మించి ఉప్పును వినియోగిస్తున్నారా? అయితే ఈ ముప్పు తప్పదంటోన్న నిపుణులు
Obesity: జంక్ ఫుడ్ అధికంగా తినడం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఒబెసిటీ సమస్యలు తలెత్తుతాయంటున్నారు. వీటికి తోడు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు
Obesity: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి, మానసిక ఒత్తిడి.. ఇలా ఊబకాయానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లే అధిక బరువుకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జంక్ ఫుడ్ అధికంగా తినడం, తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఒబెసిటీ సమస్యలు తలెత్తుతాయంటున్నారు. వీటికి తోడు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ సమస్యకు కారణాలుగా చెప్పవచ్చు. అయితే వంటల్లో రుచి కోసం ఉప్పు అధికంగా వాడుతున్నట్లయితే ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు నిపుణులు. ప్రస్తుత కాలంలో పెద్దలతో పాటు పిల్లలు కూడా జంక్‌ఫుడ్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఇది భవిష్యత్‌లో తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
బాడీ డీహైడ్రేట్‌తో పాటు..
మోతాదుకు మించి ఉప్పు తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి స్థాయులు తగ్గిపోతాయి. కాలక్రమేణా ఇది దీర్ఘకాలిక రక్తపోటు సమస్యలతో పాటు గుండె జబ్బులకు కారణమవుతుంది. శరీరంలో అధిక బరువు పెరగడానికి దోహదపడుతుంది. సాధారణంగా టేబుల్ సాల్ట్ వంటకాల రుచిని పెంచుతుంది. ఇందులో 40 శాతం సోడియం ఉంటుంది. పోషకాహార నిపుణుల లెక్క ప్రకారం సగటున రోజు వారీ మొత్తం మీద 2,300 మిల్లీ గ్రాముల ఉప్పు లేదా ఒక టీ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, రక్తపోటు సమస్యలు తలెత్తడానికి కారణమవుతుంది. పైగా శరీరంలో విషతుల్య పదార్థాలు తయారవుతాయి. వీటి భారం క్రమగా మూత్రపిండాలపై పడుతుంది. ఇక అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల అతిగా దాహమేస్తుంది. ఫలితంగా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. ఇక ఉప్పుతో కూడిన ఆహార పదార్థాలు డీ హైడ్రేషన్‌కు కారణమవుతాయి. శరీరంలో ఇది ఫ్రక్టోజ్, కొవ్వుల ఉత్పత్తిని పెంచుతాయి. వీటి వల్ల చర్మం పొడి బారిపోయి దురదగా అనిపిస్తుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల త్వరగా అలిసిపోతారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి