Baking Soda And Lemon: ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..

బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి ఉపయోగించడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అనేక వ్యాధులను దూరం చేస్తుంది.

Baking Soda And Lemon: ఈ మిశ్రమాన్ని రెగ్యులర్‌గా తీసుకుంటే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి..
Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 01, 2022 | 6:00 PM

Baking Soda And Lemon Health Benefits: బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి ఉపయోగించడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అనేక వ్యాధులను దూరం చేస్తుంది. ఈ సందర్భంలో.. మీరు ప్రతిరోజూ బేకింగ్ సోడా, నిమ్మకాయను తీసుకోవచ్చు. గోరువెచ్చని నీటితో కలిపి ఈ రెండింటిని తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. బేకింగ్ సోడా, నిమ్మరసం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

బేకింగ్ సోడా – నిమ్మకాయ ఆరోగ్య ప్రయోజనాలు..

బరువు తగ్గుతుంది : బేకింగ్ సోడా, నిమ్మరసం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. దీని కోసం మీరు వ్యాయామం చేసే ముందు నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇది శక్తి స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది. అలాగే దీన్ని రోజూ తీసుకోవడం వల్ల స్టామినా పవర్ కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

జీర్ణ శక్తిని బలోపేతం చేస్తుంది: జీర్ణ శక్తిని బలోపేతం చేయడానికి నిమ్మకాయ సహజంగా పనిచేస్తుంది. మీ జీర్ణ శక్తి బలహీనంగా ఉంటే నిమ్మ – బేకింగ్ సోడా తీసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి బలంగా మారుతుంది.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: బేకింగ్ సోడా – నిమ్మకాయ రసం కాలేయాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో ఉండే టాక్సిన్స్‌ని తొలగించగలదు. అంతే కాకుండా కాలేయాన్ని కూడా స్ట్రాంగ్ గా మార్చుతుంది.

గుండెల్లో మంటను తగ్గిస్తుంది: బేకింగ్ సోడా – నిమ్మరసం తీసుకోవడం వల్ల పొట్టలోని ఆమ్లత్వాన్ని శాంతపరుస్తుంది. అదే సమయంలో కడుపు పూతలు, నొప్పి సమస్యను కూడా నివారిస్తుంది.

హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది: నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దీంతోపాటు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రెండింటి మిశ్రమం మన శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించగలవు. మరోవైపు, ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడటంతోపాటు గుండెకు మేలు చేస్తుంది.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..