Weight Loss Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగితే బరువు తగ్గుతారా? ఇదీ వాస్తవం..

బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ప్రత్యేక ఆహారం తీసుకుంటే , మరికొందరు వ్యాయామం, యోగా వంటివి ఫాలో అవుతుంటారు. ఐతే చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో గ్లాసుడు వేడి నీళ్లు తాగితే త్వరగా బరువు తగ్గుతుందని నమ్ముతారు. నిజానికి..

Weight Loss Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగితే బరువు తగ్గుతారా? ఇదీ వాస్తవం..
Hot Water Benefits
Follow us

|

Updated on: Sep 01, 2022 | 5:47 PM

Hot water for weight loss: బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఆరోగ్యానికి హాని తలపెట్టే అలవాట్లు మన జీవితాల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా ఒబేసిటీ, నిద్రలేమి, పౌష్టికాహారలోపం వంటి ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఎక్కువ మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు తెల్పుతున్నాయి. ఇక బరువు తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ప్రత్యేక ఆహారం తీసుకుంటే , మరికొందరు వ్యాయామం, యోగా వంటివి ఫాలో అవుతుంటారు. ఐతే చాలా మంది ఉదయం పూట ఖాళీ కడుపుతో గ్లాసుడు వేడి నీళ్లు తాగితే త్వరగా బరువు తగ్గుతుందని నమ్ముతారు. నిజంగా గోరువెచ్చని నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారా? బరువు తగ్గే ప్రక్రియలో నీళ్ల పాత్ర ఏమిటి? వంటి విషయాలు మీకోసం..

వేడినీళ్లు తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, నష్టాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో వేడినీళ్లు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకుపోతాయి. అలాగే ఆహారం తిన్న తర్వాత వేడి లేదా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. ఐతే ఇది శరీర బరువును నేరుగా ప్రభావితం చేయదు. ఎక్కువ మొత్తంలో నీళ్లు తాగితే బరువు తగ్గవచ్చు. అంతే కాకుండా తినడానికి ముందు అర లీటరు నీళ్లు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది. రోజు మొత్తంలో వేడి నీళ్లు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. వేడి నీళ్లకు కొవ్వును విచ్ఛిన్నం చేసే లక్షణం ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ సక్రమంగా పరిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉదయాన్నే హెర్బల్ టీ తాగితే బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఉదయాన్నే బ్రేక్‌ ఫాస్ట్‌ చేస్తే, రోజంతటికి కావల్సిన శక్తి అందుతుంది. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ పగటిపూట భోజనం మానేయకూడదు. ఆకలిగా అనిపించినప్పుడు పండ్లు, విత్తనాలను స్నాక్‌గా తినవచ్చు. వీటిల్లో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీనితో పాటు కొంత శారీరక వ్యాయామం కూడా చెయ్యాలి. ఈ పద్ధతులను పాటిస్తే బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండాలి.