AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Healthy Drinks: ప్రతి రోజూ ఈ డ్రింక్స్‌ తాగారంటే కాస్మటిక్స్‌ వాడకుండానే మీ చర్మం మెరిసిపోతుంది..

సహజమైన చర్మకాంతి పొందాలంటే రోజు వారీ ఆహారాల్లో కొద్ది మార్పులు చేసుకుంటే సరి. అవేంటంటే.. పండ్లు, కూరగాయలతో తయారు చేసిన..

Healthy Drinks: ప్రతి రోజూ ఈ డ్రింక్స్‌ తాగారంటే కాస్మటిక్స్‌ వాడకుండానే మీ చర్మం మెరిసిపోతుంది..
Beauty Tips
Srilakshmi C
|

Updated on: Sep 01, 2022 | 5:18 PM

Share

Drink these drinks regularly for beautiful skin: వాతావరణ కాలుష్యం, జీవనశైలి కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కిన్‌ ప్రాబ్లెమ్స్‌ వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందడానికి అనేక మంది రకాల సౌందర్య సాధనాలను ఉపయోగిస్తుంటారు. ఐతే ఈ కాస్మెటిక్స్‌ ఖరీదైనవేకాకుండా దీర్ఘకాలంలో చర్మానికి తీరని నష్టం కలుగజేస్తాయి. సహజమైన చర్మకాంతి పొందాలంటే రోజు వారీ ఆహారాల్లో కొద్ది మార్పులు చేసుకుంటే సరి. అవేంటంటే.. పండ్లు, కూరగాయలతో తయారు చేసిన జ్యూస్‌లు లేదా పానియాలు. వీటిలోని పోషకాలు చర్మాన్ని లోతుగా పోషించడంలో సహాయపడతాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంతోపాటు, ముఖానికి సహజమైన కాంతిని అందిస్తుంది. కొన్ని ముఖ్యమైన డ్రింక్స్‌ ఇవే..

జీవక్రియ సక్రమంగా పనిచేయడానికి నీరు అధికంగా తాగడం అవసరం. ఫలితంగా జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను శుభ్రం చేయడంలో తాగునీరు సహాయపడుతుంది. నీరు ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది. మొటిమలు, వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది. గ్రాసుడు వేడి నీళ్లో, తేనె, నిమ్మరసం కలుపుకుని ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. తేనెలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రింక్‌ తాగడం వల్ల శరీరంలోని మలినాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. ఈ డ్రింక్‌ చర్మానికి సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

తాజా పండ్లతో తయారు చేసిన జ్యూస్‌లలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మొటిమలు, మచ్చలను నివారించడంలో ఉపయోగపడతాయి. దానిమ్మ, నారింజ, క్యారెట్ వంటి పండ్ల రసాలను ప్రతి రోజూ తాగవచ్చు. చర్మంపై మొటిమలు, ముడతలు, పిగ్మెంటేషన్ తొలగించడంలో పండ్ల రసాలు కీలకంగా వ్యవహరిస్తాయి. గ్రీన్ టీ గ్రీన్ టీలో కూడా యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి అలర్జీలు రాకుండా నివారిస్తాయి. అలాగే పాలల్లో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే ఆరోగ్యానికే కాకుండా చర్మానికి కూడా చాలా మేలు వనగూరుతుంది. పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యవంతం చేయడమేకాకుండా వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.

Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..
మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..