SAIL Recruitment 2022: పదో తరగతి అర్హతతో రూర్కెలా స్టీల్ ప్లాంట్‌లో 333 ఉద్యోగాలు.. ఎంపిక విధానం, దరఖాస్తుల వివరాలివే..
భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Rourkela Steel Plant).. 333 అసిస్టెంట్ మేనేజర్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, మైనింగ్‌మేట్ తదితర పోస్టుల..
SAIL Rourkela Asst. Manager Recruitment 2022: భారత ప్రభుత్వ సంస్థ అయిన రూర్కెలాలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL Rourkela Steel Plant).. 333 అసిస్టెంట్ మేనేజర్, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్, మైనింగ్‌మేట్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్, సర్వేయర్, ఫైర్ ఆపరేటర్, ఫిట్టర్ తదితర (Assistant Manager Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతితోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా/అండర్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 30 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 30, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 6, 2022 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.700లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఈఎస్‌ఎమ్ అభ్యర్ధులు రూ.200లు అప్లికేషన్ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష/ఇంటర్వ్యూ/ట్రేడ్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.12,900ల నుంచి రూ.1,60,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.