Bald Head: ఈ ఆహారాలు తిన్నారంటే చిన్నతనంలోనే బట్టతల ఖాయం!
ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సహజంగా ఉంటుంది. ఆరోగ్యవంతులైన వారిలో ఊడిన వెంట్రుకల స్థానంలో కొత్తవి పుట్టుకొస్తాయి. ఇది సాధారన ప్రక్రియ. ఐతే అందుకు విరుద్ధంగా..
what causes bald head: ప్రతి ఒక్కరికి జుట్టు రాలడం సహజంగా ఉంటుంది. ఆరోగ్యవంతులైన వారిలో ఊడిన వెంట్రుకల స్థానంలో కొత్తవి పుట్టుకొస్తాయి. ఇది సాధారన ప్రక్రియ. ఐతే అందుకు విరుద్ధంగా విపరీతంగా జుట్టు రాలడం ప్రారంభిస్తే మాత్రం అతి తీవ్రమైన సమస్యగా పరిగణించవల్సి ఉంటుంది. ఫలితంగా చిన్న వయసులోనే బట్టతల సంభవిస్తుంది. సాధారణంగా హార్మోన్లలో అసమతుల్యత కారణంగా బట్టతల వస్తుంది. దీనితోపాటు జీవనశైలి, ఆరోగ్యానికి హానతలపెట్టే ఆహార పదార్థాల వల్ల ఎవరైనా బట్టతల బారిన పడవచ్చన నిపుణులు అంటున్నారు. శరీరంలో విటమిన్ సి, డి, కాల్షియం సరిపడా లేకపోతే జుట్టు వేగంగా రాలిపోతుంది. జుట్టుకు ప్రోటీన్ చాలా ముఖ్యం. ఎందుకంటే జుట్టు ప్రోటీన్‌తో తయారవుతుంది. ప్రొటీన్ లేకపోవడం వల్ల జుట్టు పొడిబారడంతోపాటు నిర్జీవంగా మారి రాలడం ప్రారంభిస్తుంది. వేగంగా జుట్టు రాలడానికి కొన్ని ఆహారాలు కారణమవుతాయి. అవి ఏంటో తెలుసుకుందాం..
స్వీట్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. చక్కెరతో చేసిన ఆహారాలు అధికంగా తీసుకోవడం వల్ల బట్టతల త్వరగా వస్తుందని తెలుస్తోంది. నిజానికి.. చక్కెర వినియోగం ఇన్సులిన్ నిరోధకత సమస్య ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ఏర్పడితే జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అధిక గ్లైసెమిక్ ఆహారాలు (చక్కెరతో తయారు చేసినవి) హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. ఇటువంటి ఆహారాలు బట్టతల సమస్యను వేగవంతం చేస్తాయి.
చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల వంటి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఐతే జుట్టు రాలే సమస్యల ఉన్నవారు చేపలు తినడం మానుకోవాలి. ఎందుకంటే చేపల్లో ఎక్కువగా పాదరసం ఉంటుంది. దీనివల్ల కూడా జుట్టు రాలుతుంది. జంక్‌ఫుడ్స్ రుచికి బాగానే ఉన్న వీటిల్లో అజినోమోటో, సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. జంక్ ఫుడ్ వల్ల శరీరంలో బయోటిన్ క్షీణించడం ప్రారంభిస్తుంది. ఇది రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు వేగంగా రాలడం ప్రారంభిస్తుంది.