Health Tips: పెదాలు నల్లగా ఉండి నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా..? గులాబీ రంగులో మెరిసిపోవాలంటే..
ప్రతి ఒక్కరూ తమ పెదాలు గులాబీ రంగులో, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. కానీ కాఫీ, శీతల పానీయాలు తీసుకోవడం, రసాయనాలు కలిపిన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల పెదవులు తరచుగా నల్లగా మారుతాయి.
Lip care tips: ప్రతీ ఒక్కరూ అందంగా, స్టైల్‌గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ పెదాలు గులాబీ రంగులో, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. కానీ కాఫీ, శీతల పానీయాలు తీసుకోవడం, రసాయనాలు కలిపిన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడడం వల్ల పెదవులు తరచుగా నల్లగా మారుతాయి. మరోవైపు, నల్లటి పెదవులు మీ అందాన్ని తగ్గించడమే కాకుండా ఇతరుల ముందు చులకన అయ్యేలా చేస్తాయి. మీరు కూడా పెదవులు నల్లబడటం, పొడిబారడం వంటి సమస్యలతో పోరాడుతున్నట్లయితే కొన్ని ఇంటి నివారణ చిట్కాలను అనుసరించవచ్చు. అటువంటి పరిస్థితిలో పెదవుల నల్లదనాన్ని ఎలా తొలగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
పెదాలపై నల్లదనాన్ని తగ్గించుకుని.. మృదువుగా మెరిసేలా చేసుకోవడానికి చిట్కాలు..
తేనె – నిమ్మకాయ: పెదవుల నలుపును పోగొట్టడానికి తేనె, నిమ్మకాయల వాడకం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. తేనె, నిమ్మకాయలో మెరుపు వచ్చేలా చేసే పదార్థాలు ఉంటాయి. వీటిని పెదవులపై రాసుకుంటే పెదవులను లోపలి నుంచి గులాబీ రంగులోకి మార్చుతాయి. అదే సమయంలో తేనె పెదవులను లోతుగా మాయిశ్చరైజింగ్ చేయడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. అదే సమయంలో పెదవుల నలుపును పోగొట్టాలంటే తేనె, నిమ్మరసం కలిపి వారానికి మూడుసార్లు పెదవులపై అప్లై చేయాలి.
అలోవెరా – హనీ లిప్ ప్యాక్: పెదాలను ఎల్లప్పుడూ అందంగా, మృదువుగా చేయడానికి కలబంద, తేనెతో చేసిన లిప్ ప్యాక్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీన్ని చేయడానికి ముందుగా కలబంద జెల్‌ను తీసి అందులో కొంచెం తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై 20 నిమిషాల పాటు అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీ పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి. అదే సమయంలో మీరు ఈ ప్యాక్‌ని వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.
గులాబీ రేకులు: పెదాలను పింక్‌గా ఉంచడానికి గులాబీ రేకులు సహాయపడతాయి. గులాబీ రేకులను పెదవులపై అప్లై చేయాలంటే.. ముందుగా దానిని బాగా గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం, రోజ్ వాటర్ మిక్స్ చేసి ఈ పేస్ట్‌ను ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు పెదవులపై అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవుల నలుపు పోతుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి