Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్‌లో ఏం వెతుకుతారో తెలుసా?

ప్రతీ యేట గూగుల్‌ల్లో ఎవరెవరు ఎక్కువగా ఏమేమి వెతుకుతున్నారనే డేటా ఆధారంగా ఓ నివేదికను ప్రచురిస్తుందనే విషయం తెలిసిందే. ఈ యేడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అవివాహితులైన అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా..

Google: అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు గూగుల్‌లో ఏం వెతుకుతారో తెలుసా?
Google Search
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 31, 2022 | 6:54 PM

What do girls mostly search on Google: స్మార్ట్‌ ఫోన్‌ చేతిలోకొచ్చాక ఏ విషయమైనా గూగుల్లో వెతకొచ్చు. దీంతో కావల్సిన సమాచారం కళ్ల ముందర ప్రత్యక్షమవడానికి ఎంతో సమయం పట్టదు. ఏదైన పదాన్ని గూగుల్‌లో టైప్‌ చేస్తే చాలు.. అందుకు సంబంధించిన సమాచారం స్క్రీన్‌పై దర్శనమిస్తుంది. సమస్య, సమాధానం ఏదైనా గూగుల్ మాంత్రికుడు క్షణాల్లో చెప్పేస్తాడు. ఐతే ప్రతి ఒక్కరూ వాళ్లవాళ్ల అవసరాలను బట్టి గూగుల్‌ సర్చ్‌ ఇంజన్‌లో అవసరమైన విషయాలను వెతుకుతుంటారు. ప్రతీ యేట గూగుల్‌ల్లో ఎవరెవరు ఎక్కువగా ఏమేమి వెతుకుతున్నారనే డేటా ఆధారంగా ఓ నివేదికను ప్రచురిస్తుందనే విషయం తెలిసిందే. ఈ యేడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అవివాహితులైన అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఏమి వెతుకుతున్నారనే విషయాలు వెల్లడయ్యాయి.

మనదేశంలో మొత్తం 15 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో దాదాపు 40 శాతం మంది మహిళలు తమ పని కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్నారు. ఎక్కువ సమయం ఉద్యోగానికి సంబంధించిన సమాచారం గూగుల్‌లో వెతుకుతున్నట్లు నివేదిక తెల్పుతోంది. ముఖ్యంగా అవివాహితులైన యువతులు గూగుల్‌ సర్చ్‌ ఇంజన్‌లో కెరీర్‌కు సంబంధించిన సమాచారం ఎక్కువగా వెతుకుతున్నారట. ఉదాహరణకు తదుపరి కోర్సు కోసం ఏ కాలేజ్‌ ఎంచుకోవాలి, ఆ తర్వాత ఏం జాబ్‌ చేయాలి? ఏ వృత్తిని ఎంచుకోవాలి? వంటి వాటి కోసం ఎక్కువగా వెతుకుతున్నారట.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత ఆన్‌లైన్ షాపింగ్‌కు ఎక్కువగా వెతుకుతున్నారట. ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో డ్రెస్‌లు, ఇతర దుస్తులకు సంబంధించి ఎక్కువగా వెతికేస్తున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌తోపాటు హోం రెమెడీస్, కలర్ లైటనింగ్ రెమెడీస్, ఇంట్లో వాక్స్ ఎలా చేయాలి వంటి బ్యూటీ ట్రీట్‌మెంట్ల కోసం గూగుల్‌లో వెతుకుతున్నారు. మెహందీ డిజైన్స్, రంగోలీ డిజైన్స్, హోమ్ డెకరేషన్స్ ఇలా బ్యూటీ, ఫ్యాషన్‌ సంబంధిత సమాచారం కోసం ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారని నివేదిక తెల్పింది.