Super Typhoons 2022: జపాన్‌వైపు దూసుకొస్తున్న ‘హినమ్నర్’ టైఫూన్ తుపాను.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం..
తూర్పు చైనా ప్రాంతంలో ప్రతీ ఏటా బలమైన తుపాన్లు సంభవిస్తుంటాయనే విషమం తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు ఈ సమయంలో అల్లకల్లోలం చేస్తుంటాయి. ఏటా..
Hinnamnor Super Typhoon: తూర్పు చైనా ప్రాంతంలో ప్రతీ ఏటా బలమైన తుపాన్లు సంభవిస్తుంటాయనే విషమం తెలిసిందే. భారీ వర్షాలు, వరదలు ఈ సమయంలో అల్లకల్లోలం చేస్తుంటాయి. ఏటా 20కి పైగా తుపాన్ల తాకిడి ఉంటుందంటే అక్కడ పరిస్థితి అర్థం చేసుకోండి. కాగా చైనా సముద్రంలో తాజాగా ఏర్పడిన సూపర్ టైఫూన్ తుపాను (Super Typhoon) పెను వేగంతో జపాన్ వైపు దూసుకొస్తోంది. గత కొన్ని రోజులుగా చైనా వణికిస్తున్న హినమ్నర్ అనే టైఫూన్ తుపాను జపాన్‌లోనున్న ఒకినావా వైపు మల్లుతోంది. ప్రస్తుతం ఈ తుపాను జపాన్‌కు సుమారు 230 కి.మీ దూరంలో కేంద్రీకృతమైనట్లు హాంకాంగ్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 22కి.మీ వేగంతో పశ్చిమ-నైరుతీ తీరం ద్వీపం వైపు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం తెల్పింది. తీరానికి సమీపించే సమయంలో గాలుల వేగం కొంత సద్దుమనిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. హినమ్నర్ తుఫాను ప్రభావం వల్ల గంటకు 257 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నట్లు అంతర్జాతీయ వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి. ఈ సూపర్ టైఫూన్ తుఫాన్ ప్రభావం వల్ల జపాన్‌లోని దక్షిణ దీవులకు అధిక ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. మరోవైపు సముద్రంలో దాదాపు 15 మీటర్ల మేర ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. ప్రస్తుతం అక్కడ వీస్తోన్న గాలులను పరిశీలిస్తే ప్రపంచంలో ఈ ఏడాది (2022)లోనే అత్యంత బలమైన తుపానుగా జపాన్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు. అయితే, తీరానికి సమీపించే సమయంలో గాలుల వేగం కొంత క్షీణించే అవకాశం ఉందని జేటీడబ్ల్యూసీ ముందస్తు అంచనా వేసింది.