Hyderabad: హైదరాబాద్‌ విద్యార్థినికి రూ.50 లక్షల యూరోపియన్‌ స్కాలర్‌షిప్‌.. అభినందనలు తెల్పిన గవర్నర్..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Aug 31, 2022 | 9:57 PM

హైదరాబాద్‌లోని వరంగరల్‌కు చెందిన చలమల్ల ఇక్షిత ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AINST)లో న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లో బీటెక్‌ పూర్తి..

Hyderabad: హైదరాబాద్‌ విద్యార్థినికి రూ.50 లక్షల యూరోపియన్‌ స్కాలర్‌షిప్‌.. అభినందనలు తెల్పిన గవర్నర్..
Akshita

Erasmus Mundus SARENA Scholarship 2022: హైదరాబాద్‌లోని వరంగరల్‌కు చెందిన చలమల్ల ఇక్షిత ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AINST)లో న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ స్పెషలైజేషన్లో బీటెక్‌ పూర్తి చేసింది. రెండు సంవత్సరాల పీజీ కోర్సు చదివేందుకుగానూ రూ.50 లక్షల యూరోపియన్‌ కమిషన్‌ ఎరాస్మస్‌ మండస్‌ స్కాలర్‌షిప్‌ 2022కు ఎంపికైంది. ఈ స్కాలర్‌షిప్‌కు ఈ యేడాది ఎంపికైన ఏకైక విద్యార్ధిని ఇక్షిత కావడం విశేషం. ఈ సందర్భంగా ఓయూలోని పలువురు అధ్యాపకులు ఇక్షితను అభినందించారు. హైదరాబాద్ విద్యార్ధినైన ఇక్షితను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ఇక్షిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇక్షిత తండ్రి చలమల్ల వెంకటేశ్వర్లు ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu