Success Tips: ఓటములతో కృంగిపోతున్నారా.. ఇలా చేస్తే విజయం వెత్తుకుంటూ వస్తుంది..
మనం ఏమనుకుంటే అది క్షణాల్లో జరిగిపోవాల్సిందే. అది కూడా అనుకున్నవెంటనే ఈజీగా అయిపోవాలి. లేకపోతే కోపం వస్తుంది. ఇక ఇది మనవల్ల కాదులే అంటూ వెనుకడుగు వేస్తాం. నేటి యువత చాలామంది ఇదే భావనలో..
Success tips: మనం ఏమనుకుంటే అది క్షణాల్లో జరిగిపోవాల్సిందే. అది కూడా అనుకున్నవెంటనే ఈజీగా అయిపోవాలి. లేకపోతే కోపం వస్తుంది. ఇక ఇది మనవల్ల కాదులే అంటూ వెనుకడుగు వేస్తాం. నేటి యువత చాలామంది ఇదే భావనలో ఉంటుంటారు. తలచుకోవడమే ఆలస్యం.. అద్భుతం వెంటనే జరిగిపోవాలని ఆశపడుతూ ఉంటారుజ జరగకపోతే ఎంతో ఆందోళన చెందుతారు. విజయాన్ని ఎంజాయ్ చేస్తారు. ఓటమిని మాత్రం ఒప్పుకోరు. గెలుపును ఆస్వాదించినట్లు ఓటమిని ఆస్వాదించరు. గెలుపుకు తనను తాను ఓనర్ గా చెప్పుకుంటారు. ఓటమికి మాత్రం ఇతరులను బాధ్యులను చేయడం సర్వసాధారణం. మనం ఏదైనా ప్రపోజల్ పెడితే అది వెంటనే అందరూ ఒప్పుకోవాలి అనే భావనతో ఉంటాం. మన ప్రపోజల్ మనకు గొప్పదే. కాని మనకంటే గొప్పగా ఆలోచించేవారు ఉంటారనే ఆలోచన మనలో రాదు. మనల్ని మనం గొప్పగా అంచనావేసుకోవడంలో తప్పులేదు. కాని అవతలివారిని తక్కువుగా అంచనా వేయడమే చాలా మంది చేస్తున్న తప్పు. ముఖ్యంగా నేటి యువత అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడానికి ప్రధాన కారణం ఓపిక లేకపోవడం. మనం చాలామందిని చూస్తూ ఉంటాం.. వారిని మనం ఎంత విసిగించినా ఎంతో ఓపిక, సహనంతో ఉంటారు. అదే మరికొంతమంది అయితే ఇమిడియట్ గా రియాక్ట్ అవుతారు. సేమ్ టు సేమ్ ఓపిక, సహనం ఉన్న వాడు భవిష్యత్తుల్లో ఎక్కువ సక్సెస్ చూస్తారు. అవి లేనివాడు ఒక లక్ష్యం దగ్గరే ఆగిపోతాడు. నేటి యువతలో ఓపిక చాలా తక్కువ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జీవితంలో సక్సెస్ చూడాలంటే ఎంతో ఓపిక అవసరం.
విత్తనం నాటిన రోజే అది మొక్కై, పండుఎని ఇస్తుందా.. ఇవ్వదు. విత్తనం మొలకెత్తాలి. పెరగాలి, తర్వాత అది ఫలాలిస్తుంది. ఇదంతా జరగాలంటే దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓపికతో కాపాడుకుంటే.. కొంత కాలానికి అది పండ్లు ఇవ్వడం మొదలుపెడుతుంది. అలాగే మన లక్ష్యం విత్తనం లాంటిది. అది వెంటనే ఫలితాలు ఇవ్వదు. మనం తగినంత శ్రద్ధ వహిస్తూ.. ఓపికగా ఉంటే ఏదొక రోజు ఫలితం వస్తుంది. మన ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. మన ఎఫర్ట్స్లోనే లోపం ఉందనుకోండి.. ఇక మనం ఆ లక్ష్యం మీద ఆశలు వదులుకోవాల్సివస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. విజయం ఈజీగా వస్తే ఇప్పటికే అందరూ సక్సెస్ అయిపోయి ఉంటారు. కొందరికి ఈజీగా సక్సెస్ వచ్చిందనుకుంటాము కానీ.. అంతకుముందు వారెంత కష్టపడ్డారో మనం తెలుసుకోలేము. విజయం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటన్నింటిని ఎదుర్కొంటూ ముందుకెళ్తే తప్పకుండా విజయం నీకు తలవంచుతుంది. ఇదంతా జరగాలంటే ఓపిక, సహనం ఎంతో అవసరం.
ఈరోజు మనం అనుకున్నది జరగలేదు అంటే నిరాశచెందకండి.. మనం ఈరోజు చేసిన పొరపాట్లు ఏమిటో ఓపికతో గమనించి.. వాటిని రేపు చేయకుండా ఉంటే చాలు. పొరపాట్లు జరగటం తప్పుకాదు. ఎప్పుడూ ఒకటే పొరపాటు చేయడం తప్పు.. కొత్త కొత్త పొరపాట్లు వల్ల మనం ఎన్నో నేర్చుకుంటాం.. తద్వారా విజయానికి మనం దగ్గర కూడా అవుతాం. ఓపిక పడితే తప్పనిసరిగా మనం విజేతలుగా నిలబడొచ్చు. మనం కొన్ని సందర్భాల్లో స్నేహితులు లేదా పెద్దవాళ్లు కొన్ని మంచి సూచనలు, సలహాలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. వారు చెప్పడం పూర్తిచేయకుండానే నాకు తెలుసులే అంటే మధ్యలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం. అంటే వినే ఓపిక మన దగ్గర లేదు. అంటే మనం వేరే వాళ్లు మాట్లాడకుండా ఎలా అడ్డుకుంటున్నామో.. ఓపిక అనేది లేకపోతే మన లక్ష్యం కూడా అలా మధ్యలోనే ఆగిపోతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఓపిక, సహనంతో తమ లక్ష్యం కోసం ప్రయత్నిస్తే.. విజయం పరిగెత్తుకుంటూ వస్తుంది.
మరిన్ని వార్తల కోసం చూడండి..