IFGTB Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడులోని కోయింబత్తూరులోనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (IFGTB).. ఒప్పంద ప్రాతిపదికన 15 సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్/సీనియర్ రీసెర్చ్ ఫెలో తదితర పోస్టుల..
IFGTB Coimbatore Project Staff Recruitment 2022: భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు చెందిన తమిళనాడులోని కోయింబత్తూరులోనున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (IFGTB).. ఒప్పంద ప్రాతిపదికన 15 సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్/సీనియర్ రీసెర్చ్ ఫెలో/సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో/ప్రాజెక్ట్ అసోసియేట్-II/ప్రాజెక్ట్ అసోసియేట్-I/జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో/ప్రాజెక్ట్ అసిస్టెంట్స్/ఫీల్డ్ అసిస్టెంట్స్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో బయోటెక్నాలజీ/బోటనీ/అగ్రికల్చర్ బయోటెక్నాలజీ/జినోమిక్స్/బయోఇన్ఫర్మాటిక్స్/బయోకెమిస్ట్రీ/ఫారెస్ట్రీ/హార్టికల్చర్/ప్లాంట్ బ్రీడింగ్‌లో ఎమ్మెస్సీ లేదా లైఫ్‌సైన్స్/ప్లాంట్ సైన్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎమ్మెస్సీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో రీసెర్చ్ అనుభవం కూడా ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జూన్ 1, 2022వ తేదీ నాటికి 40 యేళ్లకు మించకుండా ఉండాలి. యూజీసీ నెట్, గేట్, బెట్, ఏఆర్‌ఎస్‌ఎన్ఈటీలలో ఏదో ఒకదానిలో అర్హత ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 19, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల నుంచి రూ.42,000లతోపాటు ఇతర అలవెన్స్‌లను జీతంగా చెల్లిస్తారు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.