AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Crime: పచ్చని కాపురంలో చిచ్చురేపిన అనుమానం! భార్యను కొట్టి చంపి.. ఆపై..

నూరేళ్లు తోడుంటానని చేసిన పెళ్లినాటి ప్రమాణాలను అనుమానంతో తెగనాడాడు ఆ భర్త. పిల్లలతో కలలలాడవల్సిన తన ఇంటిని నరకంలా మర్చేశాడు. ఆవేశంలో భార్యను హతమార్చి..

Hyderabad Crime: పచ్చని కాపురంలో చిచ్చురేపిన అనుమానం! భార్యను కొట్టి చంపి.. ఆపై..
Man Kills Wife
Srilakshmi C
|

Updated on: Aug 31, 2022 | 9:35 PM

Share

Man kills wife: నూరేళ్లు తోడుంటానని చేసిన పెళ్లినాటి ప్రమాణాలను అనుమానంతో తెగనాడాడు ఆ భర్త. పిల్లలతో కలలలాడవల్సిన తన ఇంటిని నరకంలా మర్చేశాడు. ఆవేశంలో భార్యను హతమార్చి, జైలు పాలయ్యాడు. ఏం జరుగుతుందో తెలుసుకోలేని ముగ్గురు పసిపిల్లల ఏడుపులు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తోంది. వివరాల్లోకెళ్తే.. మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ సీఐ జగదీశ్వర్‌రావు తెలిపిన కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహ్మదాబాద్‌ మండలానికి చెందిన ఆముదాలగడ్డ తండా నివాసి లలిత (28), మౌలాలిలోని హనుమాన్‌నగర్‌లో ఉండే శంకర్‌తో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడేళ్ల కుమార్తె, ఐదేళ్లు, మూడేళ్ల కుమారులు సంతానం. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. ఈ క్రమంలో భార్య లలిత తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండటంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు భర్త శంకర్‌. ఈ విషయమై తరచూ భార్యభర్తలిద్దరూ గొడవపడేవారు. మంగళవారం కూడా వీరి మధ్య వాగ్వివాదం తెలెత్తింది. కోపంలో భర్త శంకర్‌ చెక్కతో భార్య లలిత తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో పిల్లనిచ్చిన మామ ఫిర్యాదుతో పోలీసులు కేసు ఫైల్‌ చేసి, శంకర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.