- Telugu News Photo Gallery Beauty Tips In Telugu: Skin Benefits Of Tomato Ice Cubes for your daily skincare routine
Beauty Tips: టమాట ఐస్ క్యూబులతో రోజూ ఇలా చేశారంటే రెట్టింపు అందం మీ సొంతం..
మగువలు తమ మేని అందం కాపాడుకోవడానికి ఖరీదైన కాస్మటిక్స్ ఉపయోగిస్తుంటారు. ఐతే చాలా తక్కువ ఖర్యుతో వంటిట్లో దొరికే టమాటాతో అందానికి మెరుగుతులు దిద్డుకోవచ్చని తెలుసా! టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది..
Updated on: Sep 01, 2022 | 4:43 PM

మగువలు తమ మేని అందం కాపాడుకోవడానికి ఖరీదైన కాస్మటిక్స్ ఉపయోగిస్తుంటారు. ఐతే చాలా తక్కువ ఖర్యుతో వంటిట్లో దొరికే టమాటాతో అందానికి మెరుగుతులు దిద్డుకోవచ్చని తెలుసా! టమాటాలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.

విటమిన్ 'సి' యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటాయి. టమాటాతో తయారు చేసిన ఐస్ క్యూబ్స్‌తో చర్మ సంరక్షణను చాలా సులభంగా కాపాడుకోవచ్చు.

రోజూ టమాటా ఐస్ క్యూబ్స్ ను చర్మానికి అప్లై చేస్తే కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. టొమాటోలో ఉండే విటమిన్ ఎ, సి, కె విటమిన్లు మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేసి, మొటిమల సమస్య తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ఫలితంగా చర్మం శుభ్రంగా ఉంటుంది.

జిడ్డు చర్మం కలిగిన వారికి టమాటా ఐస్ క్యూబ్స్ ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాదు టొమాటో ఐస్ క్యూబ్స్‌ను రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల చర్మం బిగుతుగా మారుతుంది.

టమాటా ఐస్ క్యూబ్స్‌లో బ్లీచింగ్ లక్షణాలు ఉండటం వల్ల చర్మంలోని మృతకణాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.

కళ్ల కింద నల్లటి వలయాలతో బాధపడేవారికి టమాటా ఐస్ క్యూబ్స్ ఉపశమనం కలిగిస్తాయి. రోజూ 2 నుంచి 3 నిమిషాల పాటు టమాట ఐస్ క్యూబ్స్‌ని కళ్ల కింద మృదువుగా మసాజ్ చేస్తే క్రమంగా నలుపు తగ్గిపోయి, ఫ్రెష్ లుక్ పొందుతారు.





























