Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఆ సమయంలో నీరు తాగుతున్నారా..? అయితే, జాగ్రత్త.. ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..

క్రమం తప్పకుండా నీరు తాగితే,ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

Health Tips: ఆ సమయంలో నీరు తాగుతున్నారా..? అయితే, జాగ్రత్త.. ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..
Water
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 01, 2022 | 5:29 PM

Water Drinking: మనం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే.. తీసుకునే ఆహారం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. కొందరికి తినేటప్పుడు నీరు తాగడం అలవాటు ఉంటుంది. ఎందుకంటే నీరు తాగడం ద్వారా ఆహారం మింగడం సులభం అవుతుంది. ఇది మీ ఆరోగ్యానికి మంచిదని మీరు అనుకుంటారు.. కానీ మీకు మీరే హాని చేసుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసేటప్పుడు మనం ఎందుకు నీరు తాగకూడదు.. ఎలా తాగితే మంచిది.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణక్రియ ప్రక్రియ ఇలా జరుగుతుంది..

ఆహారం తీసుకునేటప్పుడు నీరు ఎందుకు తాగకూడదు.. అనే దానికి ముందు మనం జీర్ణక్రియ ప్రక్రియను అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ఆహారం నోటిలోకి ప్రవేశించిన వెంటనే దానిని నమలడం ప్రారంభిస్తారు. దీంతో గ్రంథులు లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. మన లాలాజలంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైములు ఉంటాయి. దీని తర్వాత ఈ ఎంజైమ్‌లు కడుపులోని ఆమ్ల జఠర రసాన్ని కలిపి ఒక మందపాటి ద్రవాన్ని ఏర్పరుస్తాయి. ఈ ద్రవాలు చిన్న ప్రేగు గుండా వెళతాయి. ఆ తర్వాత పోషకాలను గ్రహించడం ప్రారంభిస్తాయి.

ఇవి కూడా చదవండి

తాగే నీటితో జీర్ణవ్యవస్థపై ప్రభావం..

మీరు క్రమం తప్పకుండా నీరు తాగితే,ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడమే కాకుండా, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కానీ ఆహారంతో పాటు ద్రవం ఉన్నందున నీరు తాగడం మంచిది కాదు. ఇది మన జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. .

నీరు తాగటం వల్ల కడుపు ఆమ్లం, జీర్ణ ఎంజైమ్‌లు కరిగిపోతాయి. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుందని అనుకుంటారు. కానీ ఈ విషయం పూర్తిగా తప్పు. దీనికి విరుద్ధంగా తినేటప్పుడు నీరు తాగటం జీర్ణక్రియ ప్రక్రియలో సమస్యలను కలిగిస్తుంది. మరొక ప్రతికూలత ఏమిటంటే మీ పొట్ట బయటకు రావడం మొదలవుతుంది. క్రమంగా మీరు లావుగా మారుతారు. దాని కారణంగా శరీర ఆకృతి పూర్తిగా క్షీణిస్తుంది.

భోజనం తర్వాత ఎప్పుడూ నీరు తాగాలి

సాధారణంగా చాలా మంది ఆరోగ్య నిపుణులు.. ఆహారం తిన్న వెంటనే నీరు తాగడానికి దూరంగా ఉండాలని సిఫార్సు చేస్తున్నారు. మీరు భోజనం చేసిన అరగంట తర్వాత మాత్రమే నీరు తాగడం మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా చక్కగా ఉంటుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి