Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అయ్యో దేవుడా..! స్విమ్మింగ్‌ పూల్‌లో ఉత్సాహంగా ఈత కొడుతున్న యువకుడు.. చూస్తుండగానే.. షాకింగ్ వీడియో

మృత్యువు ఏ రూపంలో వస్తుందో.. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ చెప్పలేరు.. నవ్వుతూ కాసేపటి క్రితమే కనిపించిన వారు.. అకస్మాత్తుగా హఠాన్మరణం చెందుతుంటారు.

Watch Video: అయ్యో దేవుడా..! స్విమ్మింగ్‌ పూల్‌లో ఉత్సాహంగా ఈత కొడుతున్న యువకుడు.. చూస్తుండగానే.. షాకింగ్ వీడియో
Swimming Pool
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 01, 2022 | 4:04 PM

Youth Dies in Swimming Pool: మృత్యువు ఏ రూపంలో వస్తుందో.. ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవ్వరూ చెప్పలేరు.. నవ్వుతూ కాసేపటి క్రితమే కనిపించిన వారు.. అకస్మాత్తుగా హఠాన్మరణం చెందుతుంటారు. తాజాగా అలాంటి ఓ హృదయ విదారక ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. అప్పటివరకు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఉత్సాహంగా కనిపించిన వ్యక్తి.. గుండెపోటుతో నీటిలోనే కుప్పకూలాడు. ఆ తర్వాత క్షణాల్లోనే కన్నుమూశాడు. ఈ షాకింగ్‌ ఘటన మహారాష్ట్రలోని మాలెగావ్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు కాగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ.. అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.

మహారాష్ట్రలోని మాలెగావ్ పట్టణంలో ఈత కొడుతూ 19ఏళ్ల యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన ఆగస్ట్ 28న జరిగింది. అయితే.. ఈ దృశ్యం అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వగా.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మృతుడు జయేష్ భావ్‌సర్‌గా గుర్తించారు. వైరల్ వీడియోలో యువకుడు స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొడుతూ కనిపించాడు. ఆ తర్వాత క్షణాల్లోనే అకస్మాత్తుగా నీటిలో మునిగిపోయాడు. నీటిలో విలవిలలాడుతూ కనిపించిన ఆ యువకుడిని మరో ఇద్దరు యువకులు అతన్ని స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో..

వెంటనే ఆ యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరణం ఎప్పుడు వస్తుందో.. ఎలా వస్తుందో కచ్చితంగా చెప్పలేమంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం