Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Late Night Dinner: వామ్మో.. రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే, మీరు పెను ప్రమాదంలో పడుతున్నట్లే..

రోజూ రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేస్తే మాత్రం ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.. 8 గంటల తర్వాత రాత్రి భోజనం చేయడం మీ ఆరోగ్యానికి అన్ని విధాలా హానికరం..

Late Night Dinner: వామ్మో.. రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేస్తున్నారా..? అయితే, మీరు పెను ప్రమాదంలో పడుతున్నట్లే..
food
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 02, 2022 | 7:46 PM

Disadvantages of having late night dinner: సరైన సమయంలో ఆహారం తీసుకుంటే.. శరీరానికి పోషకాలు అందుతాయి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు. అలాకాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అర్థరాత్రి డిన్నర్ చేయడం వల్ల చాలా హాని కలుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చారు. చాలా సార్లు సమయాభావం వల్ల ఆలస్యంగా భోజనం చేసినా ఇబ్బంది ఉండదు.. కానీ రోజూ రాత్రి వేళ ఆలస్యంగా భోజనం చేస్తే మాత్రం ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలంటున్నారు నిపుణులు.. 8 గంటల తర్వాత రాత్రి భోజనం చేయడం మీ ఆరోగ్యానికి అన్ని విధాలా హానికరం.. అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, శరీరంలోని జీవక్రియలు నెమ్మదిగా పనిచేయడం ప్రారంభిస్తాయి. అయితే, అర్థరాత్రి భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకోండి..

అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు

జీర్ణక్రియ సమస్యలు: రాత్రివేళ ఆహారం ఆలస్యంగా తినడం వల్ల ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది. దీని కారణంగా మరుసటి రోజు ఉదయం కడుపు సరిగ్గా శుభ్రం కాదు. మరోవైపు, నిరంతరం అర్థరాత్రి భోజనం చేస్తుంటే మలబద్ధకం, అజీర్ణం లాంటి సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఆలస్యంగా తిన్న ఆహారం సులభంగా జీర్ణం కాదు.

ఇవి కూడా చదవండి

బరువు పెరుగుతుంది: ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వేగంగా బరువు పెరిగే సమస్య వస్తుంది. మరోవైపు, బరువును అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఆహారం, నిద్రకు మధ్య 3 గంటల గ్యాప్ ఉండాలి. అదే సమయంలో అర్థరాత్రి భోజనానికి దూరంగా ఉండాలి. దీనితో పాటు రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్ తినడం మానుకోండి.

నిద్రలేమి: రాత్రిపూట ఆహారం తీసుకోవడం వల్ల నిద్ర సమస్యలు కూడా తలెత్తుతాయి. అర్థరాత్రి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంపై ప్రభావం చూపుతుంది. దీని వలన నిద్రలేమితోపాటు.. పలు సమస్యలు వస్తాయి.

రక్తపోటు: ఆలస్యంగా భోజనం చేయడం వల్ల అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, మధుమేహం వచ్చే అవకాశం ఉంది. ఇది మాత్రమే కాదు దీనివల్ల గుండె సంబంధిత సమస్యల బారిన పడే అవకాశం కూడా పెరుగుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..