Health Tips: ఆ వ్యాయామానికి ముందు ఈ పదార్థాలను తీసుకోండి చాలు.. ఇక చెలరిగిపోతారు అంతే..
వ్యాయామం చేసేటప్పుడు తగినంత శక్తి అవసరం.. దీని కోసం మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఎనర్జీని ఇచ్చే వాటిని తీసుకుంటే చాలా బెటర్ అంటున్నారు.
Pre Workout Foods For Weight Loss: బరువు తగ్గడానికి వ్యాయామం చాలా ముఖ్యం. అదే సమయంలో వర్కవుట్‌లకు శరీరంలో శక్తి చాలా అవసరం. కొంతమంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో వ్యాయామం చేసే ముందు ఏమీ తినరు, తాగరు. ఎందుకంటే వ్యాయామం చేసే ముందు ఏమీ తినకూడదని వారు భావిస్తారు. కానీ ఇది పూర్తిగా తప్పు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. వ్యాయామం చేసేటప్పుడు తగినంత శక్తి అవసరం.. దీని కోసం మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఎనర్జీని ఇచ్చే వాటిని తీసుకుంటే చాలా బెటర్ అంటున్నారు. వర్క్‌అవుట్‌కి ముందు మంచి ఆహారం ఎప్పుడూ ఆరోగ్యకరమే. అయితే.. ఇలాంటి సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వ్యాయామం చేసే ముందు వీటిని తినండి
అరటిపండు: అరటిపండులో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, విటమిన్ B6, మెగ్నీషియం, పొటాషియం, కాపర్ వంటి అనేక పోషకాలు దాగున్నాయి. అందువలన వర్కవుట్ చేసే ముందు అరటిపండు తీసుకోవడం వల్ల శరీరంలో ఎక్కువ కాలం శక్తిని ఉంచుతుంది. అరటిపండు పొటాషియం మూలంగా పరిగణిస్తారు. అరటిపండును వ్యాయామానికి ముందు తీసుకుంటే కడుపు చాలా కాలం పాటు నిండుగా ఉంటుంది. దీని వల్ల మీ బరువు వేగంగా తగ్గిపోతుంది.
పీనట్ బటర్ – ఎండుద్రాక్ష: పీనట్ బటర్ ప్రోటీన్ కు మంచి మూలంగా పరిగణిస్తారు. దీనితో పాటు వేరుశెనగ వెన్నలో మోనోశాచురేటెడ్ కొవ్వు కనిపిస్తుంది. పీనట్ బటర్, కిస్‌మిస్ (ఎండుద్రాక్ష) లను వ్యాయామం చేసే ముందు తీసుకుంటే, అవి శరీరం శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ఈ రెండింటిలోనూ ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రించడానికి పని చేస్తాయి. దీని కారణంగా బరువు కూడా వేగంగా తగ్గుతుంది.
నట్స్: నట్స్ బరువు తగ్గడం కోసం, పెరగడం కోసం ఉపయోగిస్తారు. గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వు, ప్రోటీన్, ఫైబర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని వలన శక్తి స్థాయి వెంటనే పెరుగుతుంది. ఇది వ్యాయామంలో శక్తిని ఇస్తుంది. అందుకే వర్కవుట్ ముందు నట్స్ తినడం చాలామంచిదని పేర్కొంటున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..