Health Tips: పాతకాలం మనుషుల ఆరోగ్య రహస్యం తెలుసా.. ఇప్పటి మనుషులు ఎందుకిలా అంటే..

ఈరోజు వండిన ఆహారం రేపు తినడం చాలా మందికి నచ్చదు. ఇళ్లలో ఉదయం వండిన ఆహారం మిగిలితే, దానిని రాత్రికి ఉంచరు. అవసరమైతే ఆ ఆహారాన్ని పాడేసి, రాత్రికి మళ్లీ ఆహారాన్ని రెడీ చేసుకుంటారు. ఇవ్వన్నీ పాత..

Health Tips: పాతకాలం మనుషుల ఆరోగ్య రహస్యం తెలుసా.. ఇప్పటి మనుషులు ఎందుకిలా అంటే..
Heavy Food
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 03, 2022 | 9:28 AM

Health Tips: ఈరోజు వండిన ఆహారం రేపు తినడం చాలా మందికి నచ్చదు. ఇళ్లలో ఉదయం వండిన ఆహారం మిగిలితే, దానిని రాత్రికి ఉంచరు. అవసరమైతే ఆ ఆహారాన్ని పాడేసి, రాత్రికి మళ్లీ ఆహారాన్ని రెడీ చేసుకుంటారు. ఇవ్వన్నీ పాత రోజులు. నేటి ఆధునిక యుగంలో అందరూ బిజీ అయిపోతున్నారు. దీనికి తగినట్లుగా లైఫ్ స్టైల్ లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. దీంతో వంట చేయడాన్ని గతంలో ఎంతో ప్రేమించేవారు.. నేడు భారంగా భావిస్తున్న సందర్భాలున్నాయి. గతంలో ఊరుకొకటి ఉండే కర్రీ పాయింట్లు.. సాధారణ పట్టణాల్లో వీధికి రెండు మూడు తయారయ్యాయి. కొంతమంది కొన్ని ఆహారపదార్థాలను రెండు, మూడు రోజులకు సరిపడా తయారుచేసుకుని వాటిని నిల్వచేసుకుని.. తినే ముందు వేడిచేసుకుని తింటుంటాం. ఇది ఆరోగ్యానికి అసలు మంచిది కాదంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ఆయుర్వేద వైద్య పద్ధతుల ప్రకారం వండిన ఆహారాన్ని 3 గంటలలోపు లేదా గరిష్టంగా అదే రోజున తినాలి.  మనం తయారుచేసుకున్న ఆహారాన్ని గాలి కూడా చేరని డబ్బాల్లో ఎంత నిల్వ ఉంచినా.. మరుసటి రోజుకు అది తాజాగా ఉండదు. కచ్చితంగా పాడైపోతుంది. ఫ్రిజ్​లోపెట్టి నిల్వచేసినా.. ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు ఆయుర్వేద నిపుణులు.

మిగిలిపోయిన ఆహారాన్ని మరుసటి రోజు తీసుకుంటే అది మిమ్మల్ని మరింత సోమరులను చేస్తుంది. సాధారణంగా వండిన ఆహారాన్ని వంట చేసిన కొన్ని గంటల్లోనే తినాలని.. మరుసుటిరోజుకు మిగిలి ఉంటే వాటిని అవశేషాలు అంటారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నిల్వ ఉన్న ఆహార పదార్థాలలో ఎటువంటి శక్తి ఉండదని, అందుకే అవి వ్యక్తుల్ని మరింత నీరసంగా, సోమరిపోతులుగా చేస్తాయని చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఆహారంలో వ్యాధులతో పోరాడే సామర్థ్యం తక్కువు ఉంటుంది. ఇది మన రోగనిరోధక వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తుంది. తాజా ఆహారం మానసిక ఉల్లాసం, ప్రశాంతత, శక్తిని అందిస్తే.. నిల్వ ఉంచిన ఆహారం సోమరితనాన్ని పెంచుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

నిల్వ ఉంచిన ఆహారం ఎందుకు తినకూడదు: మిగిలిపోయిన ఆహారం తక్కువ పోషక విలువలను కలిగి ఉంటుంది. నిల్వ ఉంచిన ఆహారాన్ని నిరంతరం తినడం వల్ల శరీరంలో నీరసం వచ్చేస్తుంది. ప్రతిరోజూ మిగిలిపోయిన ఆహారాన్ని తినే వ్యక్తులు క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉందంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు ఇలాంటివి సమస్యలు ఉండేవి కాదు. ఎప్పుడు వండేవి అప్పుడే తినేవారు. లేదా కొన్ని గంటల్లో తినేవారు. ఒకవేళ అన్నం తిన్నా.. దానిని గంజితోనో.. లేదా మజ్జిగతో తీసుకునేవారు అందుకే పాతకాలం మనుషులు ఎంతో ధృఢంగా ఉండేవారు. నేటి ఆధునిక కాలంలో ఒక కూరను రెండు రోజులకు వండేసుకోవడం. లేదా రేపు వంట చేసే శ్రమ తగ్గుతుందని ఈ రోజే ఎక్కువ వండేసి ఫ్రిజ్​లో పెట్టడం చాలామంది చేస్తున్నారు. పైగా వాటిని ఫ్రిజ్​ నుంచి తీసి మళ్లీ వేడి చేసి తింటున్నారు. అందుకే ఇది పెరుగుతున్న వ్యాధులకు కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలా మిగిలిన ఆహారాన్ని తినకుండా ఉండేదుంకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కావాల్సినంత ఆహారాన్నే తయారుచేసుకోవాలి. ఈరోజు వండిన భోజనాన్ని మరుసటి రోజు నిల్వ ఉంచకుండా వండిన రోజునే తినడానికి ప్రయత్నించాలి. అప్పటికీ ఆహారం మిగిలి ఉంటే.. అదే రోజు ఆహారం అవసరమైన వారికి ఇవ్వడం ద్వారా ఆహారం నిల్వలేకుండా చూసుకోవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..