Chicken: చికెన్‌ను స్కిన్‌తో పాటు తినడం మంచిదేనా?.. అమెరికా అగ్రికల్చర్, న్యూట్రీషియన్ సెంటర్ కీలక నివేదిక
Chicken: చాలా మంది మాంసహార ప్రియులుంటారు. అందులో చికెన్ అంటే లొట్టలేసుకునే వాళ్లు ఎంతో మంది ఉంటారు. అయితే కొందరికి చికెన్ స్కిన్‌తో తినడం ఇష్టముంటే..
Chicken: చాలా మంది మాంసహార ప్రియులుంటారు. అందులో చికెన్ అంటే లొట్టలేసుకునే వాళ్లు ఎంతో మంది ఉంటారు. అయితే కొందరికి చికెన్ స్కిన్‌తో తినడం ఇష్టముంటే.. మరి కొందరికి చికెన్ స్కిన్‌లెస్ ఇష్టం. 100 గ్రాముల చికెన్ స్కిన్‌లో 32 శాతం వరకు కొవ్వు ఉంటుందని అర్జెంటీనాలో మీట్ న్యూట్రీషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్‌కు చెందిన పోషక ఆహార నిపుణులు చెబుతున్నారు. చికెన్ స్కిన్‌లో కొంత మంచి కొవ్వు కూడా ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి మెరుగు పర్చడంలో ఉపయోగపడుతుంది.
మూడో వంతు చెడు కొవ్వు ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగేలా చేస్తుంది. ఒక వేళ మీరు చికెన్‌ను స్కిన్‌తో కలిపి తింటే దాదాపు 50 శాతం కెలరీలను పెంచుతున్నట్లుగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 170 గ్రాముల స్కిన్‌లెస్ చికెన్‌ను తింటే 284 కెలరీలు శరీంలోకి చేరుతాయని అమెరికా అగ్రికల్చర్, న్యూట్రీషియన్ సెంటర్ నివేదిక చెబుతోంది. ఈ కెలరిల్లో 80 శాతం ప్రొటీన్ల నుంచి.. 20 శాతం కొవ్వు నుంచి అంతాయి. స్కిన్‌తో కలిపి తింటే మీ శరీరంలో 386 కెలరీలు చేరుతాయి. ఇందులో 50 శతం కెలరీలు ప్రొటీన్ల నుంచి, 50 శాతం కొవ్వు నుంచి వస్తాయి.
ఎక్కువ కెలరీలు, కొవ్వు ఉండకూడదనుకుంటే చికెన్ నుంచి స్కిన్‌ను తీసివేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎలాంటి వ్యాధులు లేకుండా, ఎత్తుకు తగిన బరువు ఉండి చురుగ్గా ఉండే వారు చికెన్‌ను వండెటప్పుడు స్కిన్‌ను అలాగే ఉంచి తినేటప్పుడు తీసివేయడం మంచిదంటున్నారు. అయితే చికెన్‌ను వండెటప్పుడు స్కిన్ ఉండటం వల్ల మంచి రుచి ఉండడమే కాకుండా మంచి ఫ్లేవర్ వస్తుందని చెబుతున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. టీవీ9 ధృవీకరించడం లేదు. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి