Gold Price Today: బంగారు ప్రియులకు ఇది నిజంగానే బంపరాఫర్‌.. వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్‌ ధర.. ఈరోజు ఎంతంటే..

Gold Price Today: గత మూడు రోజులుగా బంగారం ధర నెలచూపు చూస్తోంది. ఆగస్టు 27వ తేదీ నుంచి బంగారం ధర డౌన్‌ఫాల్‌ మొదలైంది. అయితే మళ్లీ 30వ తేదీన కొద్దిగా పెరిగినా, గడిచిన మూడు...

Gold Price Today: బంగారు ప్రియులకు ఇది నిజంగానే బంపరాఫర్‌.. వరుసగా మూడో రోజు తగ్గిన గోల్డ్‌ ధర.. ఈరోజు ఎంతంటే..
Gold & Silver Price
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 03, 2022 | 7:09 AM

Gold Price Today: గత మూడు రోజులుగా బంగారం ధర నెలచూపు చూస్తోంది. ఆగస్టు 27వ తేదీ నుంచి బంగారం ధర డౌన్‌ఫాల్‌ మొదలైంది. అయితే మళ్లీ 30వ తేదీన కొద్దిగా పెరిగినా, గడిచిన మూడు రోజులుగా బంగారం ధర తగ్గుతూనే ఉంది. చివరి మూడు రోజుల్లో తులం బంగారంపై ఏకంగా రూ. 900కిపైగా తగ్గడం విశేషం. ఇక శనివారం దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో శనివారం తులం బంగారంపై ఏకంగా రూ. 170 వరకు తగ్గింది. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 46,550 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,780 గా ఉంది.

* ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 50,620 గా ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో శనివారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,950 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 51,220 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,450 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 50,670 గా ఉంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 50,620 గా ఉంది.

* విజయవాడలో శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,400 కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రూ. 50,620 వద్ద కొనసాగుతోంది.

* సాగర నగరం విశాఖపట్నంలో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 46,400 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,620 గా ఉంది.

వెండి ధర విషయానికొస్తే..

ఇక వెండి ధర విషయానికొస్తే రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన వెండి ధరలు శనివారం స్థిరంగా కొనసాగాయి. అయితే ఇది తెలుగు రాష్ట్రాలకే పరిమితం ఢిల్లీలో మాత్రం కిలో వెండిపై ఏకంగా రూ. 700 పెరిగింది. శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 52,300 కాగా, ముంబయిలో రూ. 52,300 వద్ద కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 58,000 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..