Business Ideas: మీ ఉద్యోగాన్ని వదిలి ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి.. నెలకు రూ. 2 లక్షల సంపాదన.. ఎలా ప్రారంభించాలి..?
Business Ideas: మీకు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి అధికంగా సంపాదించుకోవాలంటే మంచి అవకాశాలున్నాయి. ఉద్యోగాలు వదిలి బిజినెస్ రూట్లో వెళితే లక్షల్లో సంపాదన..
Business Ideas: మీకు కూడా వ్యవసాయం పట్ల ఆసక్తి ఉండి అధికంగా సంపాదించుకోవాలంటే మంచి అవకాశాలున్నాయి. ఉద్యోగాలు వదిలి బిజినెస్ రూట్లో వెళితే లక్షల్లో సంపాదన ఉంటుంది. చాలా మంది కూడా బిజినెస్‌ను ఎంచుకుని ఎక్కువ లాభాలు గడిస్తున్నారు. చాలా మంది ప్రైవేటు ఉద్యోగాలు చేస్తూ చాలిచాలని వేతనాలతో సతమతమవుతున్న తరుణంలో బిజినెస్ మార్గలో వెళితే మంచి లాభాలను అందుకోవచ్చు. మీకు వ్యవసాయ రంగంలో అనుభవం ఉండి ముందుడుగు వేస్తే అరటి తోడల ఉత్పత్తి ఎంతో మేలు. దీని సాగు ద్వారా ప్రతి నెలా పెద్దఎత్తున లాభం పొందవచ్చు. ఈ వ్యాపారం చేయడానికి మీరు ఎక్కువగా తిరగాల్సిన అవసరం కూడా ఉండదు. అరటి సాగులో లక్షల్లో సంపాదించుకోవచ్చని అగ్రికల్చర్ నిపుణులు చెబుతున్నారు.
ఒక్కసారి అరటి మొక్కను నాటితే 5 సంవత్సరాల పాటు ఫలాలు అందిస్తుంది. ఈ తరహా వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. రైతులకు తక్షణమే డబ్బు కూడా లభిస్తుంది. ప్రస్తుతం దేశంలోని చాలా మంది రైతులు అరటి సాగు ద్వారా మంచి లాభాలు పొందుతున్నారు.
ఎంత ఖర్చు అవుతుంది?
మీడియా కథనాల ప్రకారం.. అలాంటి వ్యవసాయం చేయడానికి దాదాపు రూ.50,000 ఖర్చు అవుతుంది. ఒక్క ఎకరం భూమిలో సాగు చేస్తే రూ.50 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో పెద్దఎత్తున సాగు చేయాల్సి వస్తే అందుకు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. మరి లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది.
వ్యవసాయం చేస్తే ఎంత లాభం?
ఈ అరటి సాగులో లాభాలు బాగానే ఉంటాయి. మీరు రూ.1.5 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు లాభం పొందవచ్చు. అదే సమయంలో మీరు ఒక ఎకరం భూమిలో సాగు చేసిన పంటను రూ. 3 నుండి రూ.3.5 లక్షలకు అమ్మవచ్చు. భారతదేశం అత్యధికంగా అరటిపండ్లను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశం అరటిపండ్లలో అతిపెద్ద ఉత్పత్తిదారు. ఇది 25 శాతం వాటాతో ప్రపంచంలోనే అతిపెద్ద అరటి ఉత్పత్తిదారుగా ఉంది. భారత్‌లో దాదాపు 2 లక్షల 20వేల హెక్టార్లలో అరటి పంట సాగవుతోంది. విస్తీర్ణం పరంగా అరటి పంటలో మహారాష్ట్ర మూడో స్థానంలో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి