Telugu News » Photo gallery » Photo gallery important documents you must have in your smartphone
Important Documents: స్మార్ట్‌ఫోన్ గ్యాలరీలో ఈ ముఖ్యమైన ఫోటోలు తప్పనిసరి ఉండాల్సిందే.. అవేంటంటే..!
Subhash Goud |
Updated on: Sep 02, 2022 | 8:23 PM
Important Documents: ఆధార్ కార్డు. కొన్నిసార్లు మీ ఆధార్ కార్డ్ హార్డ్ కాపీ ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో..
Sep 02, 2022 | 8:23 PM
Important Documents: ఆధార్ కార్డు. కొన్నిసార్లు మీ ఆధార్ కార్డ్ హార్డ్ కాపీ ఉండకపోవచ్చు. అటువంటి పరిస్థితిలో ఫోన్‌లో దాని డిజిటల్ కాపీ లేదా హార్డ్ కాపీ ఫోటోను ఉంచడం ఎంతో ముఖ్యం. ముఖ్యమైన పత్రాల్లో ఆధార్ ఒకటి. కొన్ని సమయాల్లో ఆధార్ మీ వద్ద ఉండకపోతే దాని హార్డ్ కాపీని మీ ఫోన్‌లో ఉంచుకోవడం బెటర్.
1 / 4
మనకు ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమో.. పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం. ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో పాన్ కార్డ్ కాపీ కూడా ఒకటి. దీని హార్డ్ కాపీ కూడా ఫోన్‌లో ఉండటం ఎంతో ముఖ్యం. మీ వద్ద ఒరిజినల్ లేకని సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
2 / 4
ప్రస్తుత కాలంలో మన ఫోన్‌లో ఉండవలసిన అతి ముఖ్యమైన పత్రం కోవిడ్ టీకా సర్టిఫికేట్. మీరు కోవిడ్ 19ని నివారించడానికి వేసుకున్న రెండు డోసుల వ్యాక్సిన్‌లకు సంబంధించి సర్టిఫికేట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫోన్‌లోని గ్యాలరీలో ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్లినా కోవిడ్ రెండు వ్యాక్సిన్లు తీసుకున్నట్లు సర్టిఫికేట్ అడుగుతున్నారు. అలాంటి సమయంలో మీరు ఫోన్‌లో ఉన్న కాపీని చూపించవచ్చు. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.
3 / 4
మీరు డ్రైవింగ్ చేస్తూ ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అనేది గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా డ్రైవింగ్ లైసెన్స్‌ను తీసుకెళ్లడం మర్చిపోతే, దాని డిజిటల్ కాపీని మీ ఫోన్‌లో ఉంచుకోవడం అవసరం. DigiLocker యాప్, m-Parivahan యాప్ వంటి యాప్‌లు డిజిటల్ కాపీని సేవ్ చేయడానికి ఉపయోగపడతాయి.