PM Kisan Yojana: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం కిసాన్ డబ్బుల వచ్చేది అప్పుడేనా..? జాబితాను తనిఖీ చేయండిలా..!
PM Kisan Yojana Update: రైతులకు ఆసరాగా నిలిచేందుకు మోడీ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతుంది. మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం..
PM Kisan Yojana Update: రైతులకు ఆసరాగా నిలిచేందుకు మోడీ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతుంది. మోడీ ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒకటి. ఇందులో రైతులు ఏడాదికి రూ.6వేల చొప్పున నగదును అందుకోనున్నారు. ఈ డబ్బులు మూడు విడతల్లో అంటే రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు 11వ విడత డబ్బులు అందగా, ఇప్పుడు 12వ విడత రానుంది. ఈ పథకం ద్వారా కోట్లాది ప్రయోజనం పొందుతున్నారు. త్వరలో 12వ విడత సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాకు బదిలీ చేయనుంది. మీడియా నివేదికల ప్రకారం.. సెప్టెంబర్ 5న రైతుల ఖాతాల్లో 12వ విడత నగదును జమ చేయనుందని కేంద్ర వర్గాల ద్వారా సమాచారం.
డబ్బుల గురించి ఇలా తనిఖీ చేసుకోండి..
☛ ముందుగా మీరు అధికారిక వెబ్‌సైట్ కి వెళ్లాలి
☛ దీని తర్వాత మీరు కుడి వైపున ‘ఫార్మర్స్ కార్నర్’ ఎంపికను చేసుకోవాలి.
☛ మీరు ‘బెనిఫిషియరీ స్టేటస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
☛ ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
☛ ఇప్పుడు మీరు మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా నుండి ఏదైనా ఒక ఎంపికను ఎంచుకోవాలి. తర్వాత డేటాపై క్లిక్ చేస్తే వివరాలు వస్తాయి.
2021 ఆగస్టు-నవంబర్ మధ్య 9వ విడత 11.19 కోట్ల మంది రైతులకు అందింది. దీని తరువాత, డిసెంబర్ 2021-మార్చి 2022 మధ్య సుమారు 11.15 కోట్ల మంది రైతులు 10వ విడత అందుకున్నారు. ఇక11వ విడతలో లబ్ధిదారుల సంఖ్య 10.92 కోట్లకు తగ్గింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి