Munugodu: హీటెక్కిస్తున్న మునుగోడు పాలిటిక్స్.. నేడు కాంగ్రెస్ నేతల సమావేశం.. ఆయన హాజరుపై ఉత్కంఠ

తెలంగాణలో (Telangana) మునుగోడు ఇష్యూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ కి, పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. దీంతో ఎలాగైనా అక్కడ గెలవాలని అధికార..

Munugodu: హీటెక్కిస్తున్న మునుగోడు పాలిటిక్స్.. నేడు కాంగ్రెస్ నేతల సమావేశం.. ఆయన హాజరుపై ఉత్కంఠ
Munugodu
Follow us

|

Updated on: Sep 03, 2022 | 7:25 AM

తెలంగాణలో (Telangana) మునుగోడు ఇష్యూ పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీ కి, పదవికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. దీంతో ఎలాగైనా అక్కడ గెలవాలని అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR), కేంద్ర మంత్రి అమిత్ షా సహా పలువురు ముఖ్య నేతలు భారీ బహిరంగ సభలు నిర్వహించారు. గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే.. మునుగోడు సిట్టింగ్‌ స్థానంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ అడుగులు వేస్తోంది. మన మునుగోడు – మన కాంగ్రెస్‌ లో భాగంగా టీఆర్ఎస్, బీజేపీలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు, అధికారులు పాల్గొననున్నారు. ఉప ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు పార్టీ ముఖ్య నాయకులతో రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. కాగా.. ఇప్పటికే మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంటింటికీ వెళ్తున్నారు. అయితే.. ఎన్నికల కారణంగా పార్టీ నుంచి ఇతర పార్టీలోకి ఫిరాయింపులు అధికంగా ఉండటంతో ఆ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరుపై ఉత్కంఠ నెలకొంది. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని అధికారులు చెబుతున్నా అధి సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ముంబయి లో జరిగిన బొగ్గు కమిటీ పార్లమెంటరీ స్థాయి సమావేశానికి హాజరయేందుకు వెంకట్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 4న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో దేశవ్యాప్త ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో ఆయన పాల్గొంటారు. దీంతో ఆయన హాజరు పై సందిగ్ధం నెలకొంది.

కాగా.. తెలంగాణ శాసనసభ సభ్యత్వానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. స్పీకర్ పోచారం పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలిసి రాజీనామా లేఖను అందించారు. లేఖ ఇచ్చిన 10 నిమిషాల్లోనే స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను ఆమోదించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆరునెలల్లో లేదా అంతకుముందే మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నిక.. బీజేపీకి, అధికార పార్టీ టీఆర్ఎస్, కాంగ్రెస్ కు సవాల్ గా మారనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..