Viral News: అంతా పేరులోనే ఉంది.. వింత కారణంతో అమ్మాయి పేరు మార్చిన పేరెంట్స్‌.. అసలేం జరిగిందంటే..

Viral News: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా మార్కెట్లోకి రోజుకో కొత్త గ్యాగ్జెట్‌ అందుబాటులోకి వస్తున్నాయి. మనుషుల శ్రమను తగ్గిస్తూ ఎన్నో పనులు చేసి పెడుతున్నాయి. అయితే మనుషులకు..

Viral News: అంతా పేరులోనే ఉంది.. వింత కారణంతో అమ్మాయి పేరు మార్చిన పేరెంట్స్‌.. అసలేం జరిగిందంటే..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 03, 2022 | 1:44 PM

Viral News: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా మార్కెట్లోకి రోజుకో కొత్త గ్యాగ్జెట్‌ అందుబాటులోకి వస్తున్నాయి. మనుషుల శ్రమను తగ్గిస్తూ ఎన్నో పనులు చేసి పెడుతున్నాయి. అయితే మనుషులకు ఉపయోగపడుతున్న ఈ గ్యాడ్జెట్లే ఇప్పుడు ప్రమాదకరంగా మారుతున్నాయి. కొన్ని రకాల ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్‌ రేడియేషన్‌తో ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాయి. అయితే తాజాగా ఓ గ్యాడ్జెట్‌ అమ్మాయి పేరు మార్పునకు కారణమైంది. గ్యాడ్జెట్‌ ఏంటి.? పేరు మార్పునకు కారణం ఎందుకు అయింది అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

జర్మనీకి చెందిన ఓ ఆరేళ్ల బాలిక పేరు ‘అలెక్సా’. ఏమంటూ ఈ అలెక్సా డివైజ్‌ అందుబాటులోకి వచ్చిందో అప్పటి నుంచి స్కూళ్లో పిల్లలందరూ అలెక్సాను టీజ్‌ చేయడం ప్రారంభించారు. అలెక్సా గ్యాడ్జెట్‌ వాయిస్‌ కమాండ్స్‌కు స్పందిస్తూ సమాచారం అందిస్తుందనే విషయం తెలిసిందే. అయితే ఇదే అంశాన్ని ఆసరాగా చేసుకొని అలెక్సాను అందరూ ‘అలెక్సా పాట పాడు’. అలెక్సా డ్యాన్స్‌ చేయు’ అంటూ టీజింగ్ చేయడం ప్రారంభించారు. అమ్మాయి ప్రతిరోజూ పేరెంట్స్‌ దగ్గరికి వచ్చి విషయాన్ని చెప్పి వాపోవడం ప్రారంభించింది.

తనను తోటి విద్యార్థులు టీజ్‌ చేస్తుండడంపై బాధపడింది. దీంతో ఇది చూసిన ఆమె పేరెంట్స్‌ చిన్నారి పేరును మార్చేందుకు అధికారులకు రిక్వెస్ట్‌ చేసుకున్నారు. అయితే అధికారులు దీనికి నిరాకరించడంతో పేరెంట్స్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కోర్టుకు విన్నవించుకున్నారు. దీంతో కోర్టు వారికి మద్ధతుగా తీర్పునిచ్చింది. ఇదిలా ఉంటే ఇలాంటి సంఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు గతంలోనూ అలెక్సా పేరు ఇలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ సమయంలో అమెజాన్‌ ఈ విషయమై స్పందిస్తూ.. అలెక్సా డివైజ్‌ను ఆపరేటింగ్‌ చేయడానికి మరికొన్ని వాయిస్‌ కమాండ్‌ వర్డ్స్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి…