Telugu News Spiritual SP Fakkirappa danced in the Vinayaka immersion procession in Anantapur district Telugu news
Video Viral: గణపతి బప్పా మోరియా.. నిమజ్జనం ఊరేగింపులో స్టెప్పులేసిన ఎస్పీ.. ఆడిపాడిన పోలీసులు
వినాయకచవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులతో పండుగ వాతావరణం నెలకొంది. గణేశ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రకరకాల రూపాల్లో..
వినాయకచవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గల్లీ గల్లీలో కొలువుదీరిన గణనాథులతో పండుగ వాతావరణం నెలకొంది. గణేశ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రకరకాల రూపాల్లో వినాయకుడిని ప్రతిష్టించి భక్తులు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. పూజలు చేసిన విధానం ఒక ఎత్తైతే.. ఇష్టదైవానికి వీడ్కోలు పలుకుతూ నిమజ్జనం చేయడం మరో ఎత్తు. పండుగ రోజు ఎంత సందడి ఉంటుందో నిమజ్జనం రోజున అంతకంటే ఎక్కవ సందడి ఉంటుంది. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, ఆటాపాటలతో గణేశ్ నిమజ్జనం కార్యక్రమం చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. భారీ ఊరేగింపుతో గణనాధుని తీసుకువెళ్లి గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో గణేశ్ చతుర్థి వేడుకలు సాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో సెప్టెంబర్ 3 నుంచి వినాయక నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. పలు ప్రాంతాల్లో గణేశ్ నిమజ్జనాలు నిర్వహించారు. కాగా అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలం బోడాయిపల్లిలో నిర్వహించిన గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప, తాడిపత్రి డీఎస్పీ చైతన్య, పోలీసులు పాల్గొన్నారు.
✓ అనంతపురం జిల్లా తాడిపత్రి రూరల్ మండలంలోని ఫ్యాక్షన్ గ్రామమైన బోడాయిపల్లిలో ఈరోజు నిర్వహించిన గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS @AnantapurPolicepic.twitter.com/g3wxCAVsT3
ఇక ఈ ఊరేగింపులో డప్పుల మోతకు భక్తుల ఉత్సాహం చూసి పోలీసులు సైతం కాలు కదిపారు. ఎస్పీ ఫక్కీరప్ప గ్రామ ప్రజలతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. ఎస్పీని చూసి ఇతర పోలీసులు కూడా ఊరేగింపులో పాల్గొని స్టెప్పులేశారు. సున్నితమైన ప్రాంతంగా పేరు తెచ్చుకున్న గ్రామంలో రెండు వర్గాలకు చెందినవారిని ఒక్కటిగా చేసి వారితోనూ పోలీసులు చిందులేయించడం ప్రత్యేకత చాటుకుంది.