Horoscope Today: ఈరోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉండడం మేలు.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
రోజు మొదలవగానే.. ప్రతి ఒక్కరూ ఈరోజు తమకు ఎలా ఉంటుందో అంటూ ఆలోచిస్తారు. మంచి చెడుల గురించి తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 4వ తేదీ )ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Horoscope Today (04-09-2022): రోజు మొదలవగానే.. ప్రతి ఒక్కరూ ఈరోజు తమకు ఎలా ఉంటుందో అంటూ ఆలోచిస్తారు. మంచి చెడుల గురించి తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (సెప్టెంబర్ 4వ తేదీ )ఆదివారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశివారు ఈరోజు ఇష్టమైనవారితో గడుపుతారు. ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసిక ధైర్యంతో చేసే పనులు శుభఫలితాలను ఇస్తాయి.
వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధ బలం బాగుంటుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు ఈరోజు నిరుత్సాహంగా గడుపుతారు. అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.
కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. మానసిక దైర్యం కోల్పోకుండా పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కలహాలకు దూరంగా ఉండండి.
సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఉత్సాహంగా పనిచేస్తారు. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. మానసిక సంతోషంగా ఉంటారు. ఎవరినీ ఎక్కువగా నమ్మవద్దు.
కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆర్ధికంగా ప్రయోజనాలు పొందుతారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు.
తుల రాశి: ఈ రోజు ఈ రాశివారికి శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. వృత్తి, వ్యాపార రంగాల్లోని వారు అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో విజయాలను సొంతం చేసుకుంటారు.
వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు లాభాలను అందుకుంటారు. కొన్ని కీలక వ్యవహారాలను ఇతరులతో చర్చించి నిర్ణయాలను తీసుకోవాలి. కొన్ని చర్చలు లాభాలను అందిస్తాయి.
ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు అధికారాలతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. ముఖ్యమైన విషయాల్లో అనుకూల నిర్ణయాలను తీసుకుంటారు.
మకర రాశి: ఈరోజు ఈ రాశివారు సంతోషంగా రోజుని గడుపుతారు. కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు.
కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అవసరానికి తగిన సహాయాన్ని పొందుతారు. ముఖ్య వ్యవహారాల్లో అనుకున్నది చేస్తారు. నచ్చినవారితో ఆనందంగా గడుపుతారు.
మీన రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలను పొందుతారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం పొందుతారు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు. ఆత్మీయుల అభిమానాన్ని పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)