Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: మీ సక్సెస్ కు భయం అడ్డుగా నిలిస్తే.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి..

భయపడడం అలవాటుగా మారినప్పుడు అది ఆ వ్యక్తి బలహీనతగా మార్పు చెందుతుంది. ఆ వ్యక్తి జీవితంలో వైఫల్యానికి పెద్ద కారణం అవుతుంది. మీ జీవితానికి సంబంధించిన ఏదైనా భయం మీ విజయానికి అడ్డుగా వస్తుంటే.. దానిని అధిగమించడానికి,

Success Mantra: మీ సక్సెస్ కు భయం అడ్డుగా నిలిస్తే.. ఈ ఐదు సూత్రాలను పాటించి చూడండి..
Success Mantra
Follow us
Surya Kala

|

Updated on: Aug 25, 2022 | 6:50 AM

Success Mantra: జీవితంలో వయసుతో సంబంధం లేకుండా ఏదొక విషయంలో ఏదొక సందర్భంలో ఖచ్చితంగా భయపడతారు. కొందరికి చీకటంటే భయం, మరికొందరికి ఓటమి భయం.. ఇంకొందరికి పరీక్షలంటే భయం. వాస్తవానికి భయం అనేది మానవ జీవితంలో ఒక భాగం. కానీ ఈ భయపడడం అలవాటుగా మారినప్పుడు అది ఆ వ్యక్తి బలహీనతగా మార్పు చెందుతుంది. ఆ వ్యక్తి జీవితంలో వైఫల్యానికి పెద్ద కారణం అవుతుంది. మీ జీవితానికి సంబంధించిన ఏదైనా భయం మీ విజయానికి అడ్డుగా వస్తుంటే..  దానిని అధిగమించడానికి, ఖచ్చితంగా క్రింద ఇవ్వబడిన ఐదు విజయ సూత్రాలను పాటించి చూడండి.

  1. మనిషి ఆలోచనల నుంచి జీవితంలో భయం తరచుగా పుడుతుంది. ఉదాహరణకు.. మనం ఏదైనా పనిని చేయాలంటే.. దానిని భయంగా ఫీలవుతుంటే.. ఆ పనిని చేయలేము.
  2. మనిషి తనలోని భయాన్ని జయించాలనుకుంటే.. ఇంట్లో కూర్చొని భయం గురించి ఎప్పుడూ ఆలోచించకండి, దాని నుండి బయటపడడానికి ఆలోచనలను ఇతర విషయాలకు మళ్లించండి.. పనిలో నిమగ్నమవండి.
  3. ఈరోజు మీరు మీ భయాన్ని అదుపు చేసుకోలేకపోతే, రేపు ఈ భయం మిమ్మల్ని నియంత్రిస్తుంది. ఈ విషయాన్నీ ఖచ్చితంగా నమ్మండి.
  4. జీవితంలో భయం మీ దగ్గరికి రానివ్వకండి.. అది మీ దగ్గరికి వచ్చినా భయాన్ని పక్కకు పెట్టి.. మీ పనిలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి.  భయంతో జీవితంలో దాక్కునే ప్రయత్నం చేయకండి.. దృఢంగా ఎదుర్కోండి.
  5. ఇవి కూడా చదవండి
  6. ఏ విధమైన సంక్షోభం లేదా విపత్తు ఏర్పడినా అది మీ చెంతకు రానంత వరకూ మాత్రమే భయపడాలి. అదే మీ వద్దకు వస్తే.. దానిని ఎటువంటి భయం ..  సందేహం లేకుండా ఎదుర్కోవడానికి ఆలోచనలు చేయాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)