Vinayaka Chaviti: జీవితంలో సంపద, శ్రేయస్సు కోసం వినాయక చవితి రోజున ఈ రాశివారు ఈ మంత్రాన్ని పఠించి చూడండి..

వినాయక చవితి పండుగ రోజున గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ రాశివారు ఏ నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.. ఏ మంత్రాలను పఠించడం వలన సానుకూల ఫలితాలను పొందుతారు తెలుసుకుందాం.

Vinayaka Chaviti: జీవితంలో సంపద, శ్రేయస్సు కోసం వినాయక చవితి రోజున ఈ రాశివారు ఈ మంత్రాన్ని పఠించి చూడండి..
Lord Ganesha
Follow us
Surya Kala

|

Updated on: Aug 30, 2022 | 1:35 PM

Vinayaka Chaviti: వినాయక చతుర్థిని గణేశుడి పుట్టిన రోజుగా భావించి హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం శుద్ధ చతుర్థి రోజున వినాయక చవితి పర్వదినం జరుపుకుంటారు. పది రోజుల పాటు జరుపుకునే ఈ భారీ వేడుకక్కి దేశ వ్యాప్తంగా రెడీ అవుతున్నారు. ఈ నెల 31 వ తేదీన విఘ్నలకధిపతిని కొలవనున్నారు. వినాయక చవితి పండుగ రోజున మీ జీవితంలో ఉత్తమమై ఫలితాలు రావాలంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఈ రోజు గణేశుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ రాశివారు ఏ నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి.. ఏ మంత్రాలను పఠించడం వలన సానుకూల ఫలితాలను పొందుతారు తెలుసుకుందాం.

మేష రాశి –  ఓం విఘ్నేశ్వరాయ నమః వృషభ రాశి –  ఓం శివపుత్రాయ నమః మిథున రాశి –   ఓం లంబోదరాయ నమః కర్కాటక రాశి –  ఓం గౌరీపుత్రాయ నమః సింహ రాశి –   ఓం భక్తవాసాయే నమః కన్య రాశి –  ఓం లంబోదరాయ నమః తులా రాశి –  ఓం సర్వ కళ్యాణ హేతవేః నమః వృశ్చిక రాశి –   ఓం ఏకదంతాయ నమః ధనుస్సు రాశి –   ఓం ఉమాసుతాయ నమః మకర రాశి –   ఓం విఘ్నహరాయ నమః కుంభ రాశి –   ఓం సుఖర్తా నమః మీన రాశి –  ఓం పార్వతీపుత్రాయ నమః

వినాయక చవితి పర్వదినం రోజున గణేష్ ఆశీర్వాదం కోసం అన్ని రాశి వ్యక్తులు ఈ మంత్రాలను కనీసం 108 సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు జపించాలి. ఈ మంత్రాలను పఠించడం వల్ల సానుకూల శక్తిని పొందుతారు. జీవితంలో సానుకూలత, శ్రేయస్సు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)