AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను పొందే అవకాశం.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 25వ తేదీ ) గురువారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయోతెలుసుకుందాం..!

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులు లాభాలను పొందే అవకాశం.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Surya Kala
|

Updated on: Aug 25, 2022 | 6:17 AM

Share

Horoscope Today (25-08-2022): రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి తమ దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఈరోజు (ఆగష్టు 25వ తేదీ ) గురువారం రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయోతెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు కీలక విషయాల్లో అలోచించి నిర్ణయంతీసుకోండి. భవిష్యత్ కోసం తగిన ప్రణాళికలు వేస్తారు. ఆత్మవిశ్వాసంతో చేపట్టిన పనులను పూర్తి చేసే విధంగా ముందుకు సాగుతారు.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిక శ్రమ పడాల్సి ఉంటుంది.  బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు, కలహాలకు దూరంగా ఉండడం మేలు. చేపట్టిన పనుల్లో అధిక శ్రమ పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. బంధు, మిత్రులతో తగిన జాగ్రత్తలు తీసుకుని మెలగాల్సి ఉంటుంది. ఉత్సాహాన్ని ఇచ్చే వార్త వింటారు. శుభకాలం. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులను చేస్తారు. అధిక వ్యయం చేసే అవకాశం ఉంది. మిశ్రమ ఫలితాలను పొందుతారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేస్తారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ప్రయాణాలు చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంకల్ప బలంతో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు విందు, వినోదాలతో ఆనందంగా గడుపుతారు. ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో  పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు అవసరానికి ఆర్ధిక సాయం అందుకుంటారు. కుటుంబ సభ్యులను కలుపుకుని ముందుకు వెళ్లడం ఉత్తమం.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు శ్రమతో కూడిన ఫలితాలను పొందుతారు. మానసికంగా దైర్యం కోల్పోకుండా పనులు చేయాల్సి ఉంటుంది. బంధువులతో వాదనలకు దూరంగా ఉండండి.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు శుభవార్త వింటారు. ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ముఖ్య విషయంలో ఆర్ధిక సాయాన్ని అందుకుంటారు. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు ఇతరులతో అనుకూలంగా మెలగాల్సి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోళ్లు లాభాలను తెచ్చిపెడతాయి. ఏకాగ్రతగా చేపట్టిన పనులు పూర్తి చేస్తే.. లక్ష్యాన్ని చేరుకుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!
భోజనం తర్వాత ఇది ఓ పలుకు నోట్లో వేసుకుంటే.. మీ పొట్ట ఫుల్ ఖుష్‌!
నాన్న ఆఖరి మజిలీలోనూ కుమార్తెలు... పాడె మోసి...
నాన్న ఆఖరి మజిలీలోనూ కుమార్తెలు... పాడె మోసి...
డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా?
డయాబెటిస్‌ ఉన్నవారు పాలు, పెరుగు తీసుకోవడం మంచిదేనా?
బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
బ్లూబెర్రీస్ Vs జామపండు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
భారత బ్యాటర్లలో ధైర్యం నింపిన గంగూలీ..ఇక మైదానంలో పరుగుల సునామీనే
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు ఇలా తాగితే.. బండి నేరుగా షెడ్డుకే!
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మీ ఫోన్‌కు ఇలాంటి ఛార్జర్‌ను ఉపయోగిస్తున్నారా? 3 పెద్ద ప్రమాదాలు
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
మెగాస్టార్ సినిమాల్లో బాలయ్యకు ఆ సినిమా అంటే చాలా ఇష్టమట..
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?
ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన టాప్ 10 కంపెనీలు.. రిలయన్స్ ఎక్కడ?
టెన్త్ ఫేర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..
టెన్త్ ఫేర్‌వెల్ పార్టీలో అశ్లీల నృత్యాలు..