ఆపదలో అండగా ఉన్న కృష్ణుడు, తప్పు ఒప్పులను ఎంచని కర్ణుడు వంటి స్నేహితుడు జీవితంలో ఉండాలి.. నేటి మోటివేషనల్ థాట్ ఏమిటంటే..
మనకు సరైన సమయంలో అండగా నిలిచే శ్రీకృష్ణుడు లాంటి మిత్రుడు మాత్రమే కాదు. తప్పు ఒప్పులను ఎంచకుండా స్నేహితుడిని వదలని కర్ణుడి లాంటి స్నేహితుడు కూడా కావాలి. అన్ని సంబంధాల కంటే గొప్పదైన స్నేహానికి సంబంధించిన ఐదు గొప్ప విషయాలను గురించి ఈరోజు మోటివేషనల్ థాట్స్ లో తెలుసుకుందాం.
Success Mantra: స్నేహానికి కన్న మిన్న లోకాన లేదురా..అన్నాడో సినీ కవి. ప్రతి ఒక్కరూ జీవితంలో నిజమైన స్నేహితుడి కావాలని కోరుకుంటారు. నిజమైన స్నేహితుడు సుఖ దుఃఖాల్లోనూ కష్ట నష్టాల్లో తోడుగా అండగా ఉంటాడు. ఎప్పుడైనా జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అయోమయానికి గురైనప్పుడు సరైన మార్గాన్ని చూపిస్తాడ. మనం తప్పు చేసినప్పుడు ఎటువంటి సంకోచం లేకుండా మనకు చూపించి దిశానిర్దేశం చేస్తాడు. మనలోని లోపాలను మనకు.. మనలోని మంచిని పదిమందికి చెప్పే నిజమైన స్నేహితుడు ఒక్కడైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలని అందరూ కోరుకుంటారు. మనకు సరైన సమయంలో అండగా నిలిచే శ్రీకృష్ణుడు లాంటి మిత్రుడు మాత్రమే కాదు. తప్పు ఒప్పులను ఎంచకుండా స్నేహితుడిని వదలని కర్ణుడి లాంటి స్నేహితుడు కూడా కావాలి. అన్ని సంబంధాల కంటే గొప్పదైన స్నేహానికి సంబంధించిన ఐదు గొప్ప విషయాలను గురించి ఈరోజు మోటివేషనల్ థాట్స్ లో తెలుసుకుందాం.
- ఫ్రెండ్‌షిప్ గురించి ఏ పాఠశాల్లోనూ నేర్పారు. స్నేహితుడి కోసం ఏ స్కూల్‌కి వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ స్నేహం అంటే ఏమిటో అర్థం చేసుకోకపోతే.. జీవితంలో మీరు ఏమీ నేర్చుకోలేదని అర్థం.
- స్నేహంలో.. మీరు ఒకరి గురించి ఎంత తెలుసుకున్నారనేది ముఖ్యం కాదు. మీ జీవితంలో స్నేహానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు ఎంత తెలుసునేది ముఖ్యం.
- అయితే కొంతమంది స్నేహం ముసుగులో మోసం చేయడానికి చూస్తారు. అటువంటి వారి విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి. శరీరానికి గాయం అయినా.. ఆ గాయం నయం అవుతుంది. కానీ స్నేహం పేరుతో మీ మనసుకు ఎవరైనా గాయం చేస్తే.. ఆ గాయం ఎప్పుడూ మనసుని బాధిస్తూనే ఉంటుంది. అది పైకి కనిపించని గాయంగా నిరంతరం బాధిస్తూనే ఉంటుంది.
- మీ శత్రువుకి జీవితంలో మీ స్నేహితుడిగా మారడానికి వెయ్యి అవకాశాలు ఇవ్వండి.. కానీ మీ స్నేహితుడికి మీ శత్రువుగా మారడానికి ఎప్పుడూ అవకాశం ఇవ్వకండి.
- మీ గతాన్ని అర్థం చేసుకుని, మీ భవిష్యత్తును విశ్వసించి, మిమ్మల్ని మీరుగా అంగీకరించేవాడే నిజమైన స్నేహితుడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకం పై ఆధారపడి ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)