Horoscope Today: వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.. వ్యాపారంలో లాభాలు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today: ఈరాశివారికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. స్థిరమైన ఆలోచనలను అలవర్చుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారమూ లాభదాయకంగా ఉంటుంది.
మేషం
ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. కీలక వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. సూర్యాష్టకం జపిస్తే శుభం కలుగుతుంది.
వృషభం
సన్నిహితుల నుంచి అవసరానికి తగిన సహాయం అందుతుంది. కీలక పనులు, వ్యవహారాల్లో బంధుమిత్రుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మిథునం
వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో సానుకూల ఫలితాలున్నాయి. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అయితే బంధుమిత్రులతో కొన్ని విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. హనుమంతుడిని పూజిస్తే బాగుంటుంది.
కర్కాటకం
వీరికి శుభఫలితాలున్నాయి. సమయస్ఫూర్తితో మంచి ఫలితాలు అందుకుంటారు. ఫ్యామిలీకి సంబంధించి ఒక శుభవార్త వింటారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇష్టదైవారాధన మాత్రం మరవకూడదు.
సింహం
కొందరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండాలి. మొహమాట తత్వంతో అనవసర ఖర్చులు పెరుగుతాయి. పరమేశ్వరుడిని పూజిస్తే మంచి కలుగుతుంది.
కన్య
వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. చేపట్టిన రంగాల్లో మంచి జరుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారు. శివారాధన వల్ల శుభం కలుగుతుంది.
తుల
వీరికి శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని తప్పులు, పొరపాట్లకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. కుటుంబీకులు, బంధువులతో గొడవలు తలెత్తవచ్చు. నవగ్రహ స్తోత్రం పారాయణ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందవచ్చు.
వృశ్చికం
ఒక ముఖ్యమైన సమస్యకు పరిష్కారం దొరకుతుంది. మనసుకు దగ్గరైన వారితో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూలఫలితాలున్నాయి. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు
ధనస్సు
శ్రమను బట్టి ఫలితాలుంటాయి. మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబీకులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆదిత్య హృదయం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
మకరం
కీలక పనుల్లో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులు, సన్నిహితుల వల్ల మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
కుంభం
వీరికి శుభ ఘడియలు నడుస్తున్నాయి. స్థిరమైన ఆలోచనలను అలవర్చుకోవాలి. అప్పుడే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారమూ లాభదాయకంగా ఉంటుంది. శివారాధన చేస్తే ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.
మీనం
ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్ట దైవారాధన ఎట్టిపరిస్థితుల్లోనూ మానవద్దు.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.