Success Mantra: అదృష్టం మిమ్మల్ని వరించాలంటే.. సక్సెస్ కోసం ఈ 5 సూత్రాలను పాటించిచూడండి

అదృష్టం ఉంటే.. అర్హత లేని వ్యక్తిని నేల నుండి ఆకాశంలోకి తీసుకుని వెళ్తుంది. అదే అదృష్టం లేనప్పుడు అర్హత ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే ఆకాశం నుండి భూమికి తీసుకురాగలదు

Success Mantra: అదృష్టం మిమ్మల్ని వరించాలంటే.. సక్సెస్ కోసం ఈ 5 సూత్రాలను పాటించిచూడండి
Success Mantra
Follow us
Surya Kala

|

Updated on: Aug 27, 2022 | 3:14 PM

Success Mantra: జీవితంలో చాలా సార్లు మన జయాపజయాలకు కారణాలను వెదుకుతూ ఉంటాం. ఆలాంటి రీజన్ లో ఒకటి అదృష్టం ఒకటి. ఒక మనిషికి ఏది లభించినా…  దాని వెనుక అదృష్టం ప్రముఖ పాత్ర పోషిస్తుందని చాలా మంది నమ్మకం. అదృష్టం ఉంటే.. అర్హత లేని వ్యక్తిని నేల నుండి ఆకాశంలోకి తీసుకుని వెళ్తుంది. అదే అదృష్టం లేనప్పుడు అర్హత ఉన్న వ్యక్తి ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే ఆకాశం నుండి భూమికి తీసుకురాగలదు. ఇది నిజంగా జీవితానికి సంబంధించిన సత్యమే. విజయం, వైఫల్యం వెనుక అదృష్టం, కర్మకు సంబంధించిన రహస్యాలను వివరంగా తెలుసుకోవడానికి..  విజయానికి సంబంధించిన ఐదు సూత్రాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

అదృష్టం ఒక అతిథి లాంటిది. తరచుగా వచ్చి వెళ్తుంది. అయితే కష్టపడి పని చేయడం అనేది ఇంటి సభ్యుడి వంటిది. ఒక్కసారి కలిసి వచ్చిన, మీ నుండి విడిపోకుండా.. ఎప్పటికీ మీతోనే ఉంటుంది.

దేవుని చేతిలో వ్రాయబడిన విధి .. బహుశా ఉత్తమమైనది మనది కావచ్చు. కానీ నిజం ఏమిటంటే అదృష్టం లేదా విధి ఎల్లప్పుడూ మనం చేసే పనులు, సంకల్పం, శక్తితో వ్రాయబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఒక వ్యక్తి ఎప్పుడూ అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకుని ముందుకు వెళ్ళకూడదు. ఎందుకంటే అదృష్టాన్ని నమ్ముకుని ఎప్పుడూ దానిమీదనే ఆధారపడి ముందుకు వెళ్ళవద్దు. కష్టనష్టాలు ఏర్పడినప్పుడు… ధైర్యంతో ఎదుర్కొంటే.. అదృష్టం మిమ్మల్ని మరింత ముందుకు వెళ్తుంది.

ఒక వ్యక్తి అదృష్టం నమ్ముకుని ఎటువంటి ప్రయోజనం పొందలేడు. ఎందుకంటే అదృష్టం తలుపు తలుపు తట్టేతప్పుడు తాళం, కీ కలిగి ఉండాలి.  కర్మ కీతో తాళం తెరిచి.. విధితో మీరు పోరాడి.. మీ పనిని మీరు సక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది.

కాలంతో పోరాడి తన అదృష్టాన్ని తానే మార్చుకునే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ విజయం సాధిస్తాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)