Viral Video: ఓ మనిషి..! ఈ ప్రకృతి నీ బాబు సొత్తేం కాదు.. అన్ని జీవులకు సమాన హక్కు ఉంది..
Viral Video: ప్రకృతి సమస్త మానవాళికి దేవుడిచ్చిన వరం. మనిషి మనుగడ సాగిస్తున్నానంటే దానికి ఈ ప్రకృతే కారణం. చెట్టు, పుట్ట, నీరు ఇలా ప్రతీ ఒక్కటి భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరి సొంతం...
Viral Video: ప్రకృతి సమస్త మానవాళికి దేవుడిచ్చిన వరం. మనిషి మనుగడ సాగిస్తున్నానంటే దానికి ఈ ప్రకృతే కారణం. చెట్టు, పుట్ట, నీరు ఇలా ప్రతీ ఒక్కటి భూమ్మీద ఉన్న ప్రతీ ఒక్కరి సొంతం. ఇది కేవలం మనుషులకే పరిమితం కాదు జంతు పక్షుజాలానికి కూడా. అన్ని జీవులు మనుగడ సాగిస్తేనే మనిషి తన జీవితాన్ని సాఫీగా సాగించగలడు. అయితే మనిషి తన అత్యాశతో ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. ఒంటెద్దు పోకడతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. కనీస మానవత్వాన్ని మరిచి ఇతర ప్రాణులపై కర్కశత్వంతో వ్యవహరిస్తున్నాడు. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
సురేందర్ మెహ్రా అనే ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ షేర్ చేసిన ఈ వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఓ చోట రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టును కూల్చాల్సి వచ్చింది. జేసీబీతో చెట్టును వేళ్ల నుంచి బలంగా పెకిలించేశాడు సదరు జేసీబీ ఆపరేటర్. అయితే చెట్టును కూల్చాల్సిన అవసరం ఉంటే కూల్చితే పెద్దగా సమస్య ఉండదు. కానీ ఆ డ్రైవర్ అనాలోచిత నిర్ణయం ఎన్నో పక్షుల ప్రాణాలను బలి తీసుకుంది. చెట్టును కూల్చే సమయంలో దానిపై వందల సంఖ్యలో పక్షులు ఉన్నాయి. కనీసం వాటిని అక్కడి నుంచి పంపించిన తర్వాత చెట్టును కూల్చాలన్న విషయాన్ని మరిచిన ఆ డ్రైవర్ పక్షులు చెట్టుపై ఉండగానే కూల్చేశాడు. దీంతో కొన్ని పక్షులు చెట్టుపై నుంచి ఎగిరిపోయినా చాలా పక్షులు మాత్రం భూమ్మీద పడి గిలగిల కొట్టాయి.
It not about road widening.. It’s about “how we treat other living-beings on earth..” Hope concerned authorities must have taken needful legal action..#wilderness #UrbanEcology #nature #ConserveNature pic.twitter.com/aV16cIWmo8
— Surender Mehra IFS (@surenmehra) September 2, 2022
దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోగా కాస్త వైరల్‌గా మారింది. ఇక ఇదే వీడియోను పోస్ట్ చేసిన అటవీశాఖ అధికారి.. ‘ఇది రోడ్డు విస్తరణకు సంబంధించిన అంశం కాదు. భూమ్మీద ఉన్న ఇతర ప్రాణులను మనం ఎంత చిన్న చూపుతో చూస్తున్నాం అన్నది. సంబంధిత అధికారులు ఈ చర్యపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి’ అంటూ ట్వీట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..