AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPSC: లవర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌..! తాను మాత్రం 5 సార్లు తప్పానంటూ యువకుడు చెప్పిన ఫెయిల్యూర్‌ స్టోరీ.. ఇంట్రెస్టింగ్‌..!

అయితే, UPSCలో విజయం సాధించిన తర్వాత మనుషులు మారిపోతున్నారంటూ హరేంద్ర పాండే వాపోయాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ..

UPSC: లవర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌..!  తాను మాత్రం 5 సార్లు తప్పానంటూ యువకుడు చెప్పిన ఫెయిల్యూర్‌ స్టోరీ.. ఇంట్రెస్టింగ్‌..!
Upsc Aspirant
Jyothi Gadda
| Edited By: Janardhan Veluru|

Updated on: Sep 03, 2022 | 4:37 PM

Share

UPSC: యూపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఢిల్లీకి వస్తుంటారు. ఈ పరీక్షలు చాలా కష్టమైనవని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు…కొంతమంది విద్యార్థులు మాత్రమే దాన్ని సాధించగలరు.. తాజాగా సోషల్ మీడియాలో అటువంటి పోరాట కథ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో IAS కావాలని ఆశపడ్డ ఓ వ్యక్తి తన పోరాటం, పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న తన అనుభవాన్ని వివరించాడు. ప్రస్తుతం ఇతడి కథాంశం నెటిజన్లను బాగా కట్టుకుంటోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో…హరేంద్ర పాండే అనే ఔత్సాహికుడు తాను గత 11 సంవత్సరాలలో 5 సార్లు UPSC పరీక్షలకు హాజరయ్యానని చెప్పాడు. కానీ, తాను ఎంపిక కాలేదని పేర్కొన్నాడు. అయితే, UPSCలో విజయం సాధించిన తర్వాత మనుషులు మారిపోతున్నారంటూ హరేంద్ర పాండే వాపోయాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ..తనకు ఓ గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉందని చెప్పాడు. అయితే, ఆమె ఇప్పుడు ఐఏఎస్‌ సాధించినట్టుగాతెలిపాడు. కానీ, ఆమె ఐఏఎస్‌ అధికారిణిగా పదవి సాధించిన వెంటనే తన నంబర్‌ను మార్చుకుందని చెప్పాడు. అప్పటి నుండి వారు మళ్లీ కలుసుకోలేదని, తనను పూర్తిగా పక్కన పెట్టేసిందంటూ వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు హరేంద్రపాండే. అతని వీడియోను ఓ యూట్యూబర్ తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశాడు.

ఇకపోతే, హరేంద్ర పాండే బీహార్‌లోని గోపాల్‌గంజ్ నివాసి. 11 సంవత్సరాలలో 5 సార్లు UPSC పరీక్ష రాశారు. అతను 4 సార్లు బాగానే ఎటెమ్ట్ చేశాడు. అదృష్టం అతనికి మద్దతు ఇవ్వలేదు. అతను చదువులో బెస్ట్‌ స్టూడెంట్‌నని చెప్పాడు. 2011లో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు ఢిల్లీకి వచ్చానని హరేంద్ర యూట్యూబర్‌తో చెప్పాడు. ప్రిపరేషన్ సమయంలో తాను చేసిన తప్పులను కూడా అంగీకరించాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

యూట్యూబ్‌లోని వినియోగదారులు హరేంద్ర దృఢ సంకల్పం, నిజాయితీని ప్రశంసించారు. కొంతమంది వినియోగదారులు IAS కోసం సిద్ధమవుతున్న వ్యక్తులకు భిన్నమైన వాస్తవికత ఉందంటూ కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి