Viral News: నేరం చేయకుండానే జైలు భోజనం.. పైగా అక్కడి ఫుడ్ కోసం పోటీ పడుతున్న జనాలు..! ఎందుకంటే..

జైలుకు వెళ్లటం అనే మాటను కూడా ఎవరూ అంగీకరించరు. కానీ ఇక్కడ ఓ జైలుకు నిత్యం వందలాది మంది క్యూ కడుతున్నారు.

Viral News: నేరం చేయకుండానే జైలు భోజనం.. పైగా అక్కడి ఫుడ్ కోసం పోటీ పడుతున్న జనాలు..! ఎందుకంటే..
Jharkhand
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 03, 2022 | 3:20 PM

Viral News: జైల్లో పడితే చిప్ప కూడు తప్పదంటారు.. కానీ, ఇక్కడ కొందరు కోరి మరీ ఆ జైలు ఫుడ్ కోసం ఎగబడుతున్నారు. అదేంటి..ఎవరైనా జైలు తిండి కావాలని కోరుకుంటారా..? జైలుకు వెళ్లటం అనే మాటను కూడా ఎవరూ అంగీకరించరు. కానీ ఇక్కడ ఓ జైలుకు నిత్యం వందలాది మంది క్యూ కడుతున్నారు. ఆ జైలులో తినడానికి ఆరాటపడుతున్నారు. ఇంతకీ ఆ జైలు ఏంటీ ? ఎందుకు అక్కడి ఫుడ్‌కి అంత డిమాండ్‌ అనే కదా మీ సందేహం.. అయితే, ఈ స్టోరీని పూర్తిగా చదవాల్సిందే..

థీమ్-ఆధారిత రెస్టారెంట్లు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా యువకులలో దాగున్న నైపుణ్యానికి ఇవి అద్ధం పడుతున్నాయి. ఒక కాల్పనిక ప్రపంచంలోకి ప్రవేశించడానికి, విభిన్న వంటకాలను ఆస్వాదించడానికి, కొందరు మనసుకు నచ్చిన వ్యక్తులను కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే, జార్ఖండ్‌ జంషెడ్‌పూర్‌లోని జైలు నేపథ్య రెస్టారెంట్ – ‘కైదీ కిచెన్’ పై ప్రజలు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. తమ కస్టమర్లకు జైలులో భోజనం చేసే ప్రత్యేక అనుభూతిని అందిస్తామని రెస్టారెంట్ పేర్కొంది. లోపలి భాగంలో జైలు గది వంటి సిట్టింగ్ ప్రాంతాలు, ఖైదీల వలె దుస్తులు ధరించిన వెయిటర్లు ఉంటారు. అతిథులకు వడ్డించినట్లుగా చేతికి సంకెళ్లు మోసే నకిలీ జైలర్ కూడా కనిపిస్తాడు.

ఇక ఈ కైదీ కిచెన్‌ రెస్టారెంట్‌ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రజలు ఈ వింత అనుభవంపై తీవ్రంగా స్పందిస్తున్నారు. కొంతమంది వ్యక్తులు దీన్ని ఫన్నీగా భావిస్తుంటే..మరికొందరు దీనిని వ్యతిరేకిస్తూ సరైనది కాదంటున్నారు. ‘థీమ్-ఆధారిత’ ఆలోచన చాలా దూరం వెళ్తోదంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్‌ చేశారు. తర్వాత ఏమిటి? ఆసుపత్రి నేపథ్య రెస్టారెంటా..? ఆ అంటూ.. అని మరో నెటిజన్‌ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఆలోచన స్థానికులకు రిఫ్రెష్‌గా ఉన్నప్పటికీ, ఢిల్లీ కోల్‌కతా వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఇప్పటికే ఇటువంటి రెస్టారెంట్లు ఉన్నాయని, దాని ఆలోచన వెనుక కొత్తదనం ఏమీ లేదంటూ కొందరు నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?