Telangana: ఉన్న‌త చ‌దువులు చదువుకున్నారు.. స్వయంగా తయారు చేసిన యంత్రాలతో కూరగాయలు పండిస్తున్నారు..!

ఉన్నత చదువులు చదివి రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్న కొద్దిపాటి పొలంలో సేంద్రియ ఎరువులతో రకరకాల కూరగాయలు పండిస్తున్న ఈ అన్నదమ్ములకు..

Telangana: ఉన్న‌త చ‌దువులు చదువుకున్నారు.. స్వయంగా తయారు చేసిన యంత్రాలతో కూరగాయలు పండిస్తున్నారు..!
Brothers Farming
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 06, 2022 | 5:24 PM

Telangana: ఉన్నత చదువులు చదువుకున్నారు. కానీ, రాని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కాలాన్ని వృద్ధా చేసుకోలేదు. చాలీ చాలని జీతాలకు ఎవరి కిందో ఉద్యోగం చేసే కంటే..తామే సొంతంగా కష్టపడి పైకి రావాలని భావించారు..అదే లక్ష్యంతో వ్యవసాయం వైపు అడుగులు వేశారు. తమకున్న కొద్దిపాటి భూమిలోనే వారే స్వయంగా తయారు చేసుకున్ని పరికరాలను ఉపయోగించి కూరగాయల పండిస్తున్నారు. ప్రయోగాత్మకంగా తమకున్న అర ఎకరం పొలంలోనే కూరగాయలను పండించి లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు. స్వయం కృషితో పైకొచ్చిన ఆ ఇద్దరు అన్నదమ్ముల సక్సెస్‌ స్టోరీ ఎంటో ఇక్కడ తెలుసుకుందాం..

సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ఆరే గ్రామానికి చెందిన రాజేశ్వరరావు వజ్రమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరు చందు, భాస్కర్ ఈ ఇద్దరినీ తల్లిదండ్రులు కష్టపడి చదివించారు. చందును పీజీ వరకు చదివించారు.. భాస్కర్ ఐటిఐ పూర్తి అయింది.. కానీ, వీరికి ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. ఎంతో కష్టపడి చదివి సాధించిన సర్టిఫికెట్లు ఇంట్లోనే దాచుకోవాల్సి వచ్చింది. ఇల్లు గడవడం కష్టంగా మారడంతో దిక్కు తోచని స్థితిలో పడ్డారు.

ఏం చేయాలో అర్థం కాని సమయంలో..చదివిన చదువులతో వీరి మెదడుకు పదును పెట్టారు. స్వయానా వ్యవసాయం చేయడానికి కావలసిన పరికరాలు తయారు చేసుకున్నారు. వారికున్న అన ఎకరం పొలంలో ఎద్దులతో కాకుండా, ట్రాక్టర్ తో చదును చేయకుండా కేవలం వీరు తయారు చేసిన పరికరాలని వాడుతూ వారే ఎద్దులుగా మారి భూమిని సాగుచేస్తూ కూరగాయలు పండిస్తున్నారు. టమాటా, బెండకాయ, చిక్కుడు, సోయా బిన్స్‌, లాంటివి పండిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

ఇవి కూడా చదవండి

కష్టపడి ఉన్నత చదువులు చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు రావటం లేదని వాపోయారు. వ్యవసాయం చేయడానికి కూడా తగినంత భూమి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమలాంటి వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు అండగా నిలిచి తమలాంటి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఏదైనా ప్రాజెక్టును లోన్ల ద్వారా అందిస్తే మరెన్నో అద్భుతాలను చేస్తామంటున్నారు ఈ ఇద్దరు అన్నాదమ్ములు..

నిజంగా ఉన్నత చదువులు చదివి రెక్కలు ముక్కలు చేసుకుని ఉన్న కొద్దిపాటి పొలంలో సేంద్రియ ఎరువులతో రకరకాల కూరగాయలు పండిస్తున్న ఈ అన్నదమ్ములకు ప్రభుత్వం చేయూతనివ్వాలని కోరుకుందాం..

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే