Telangana: బీజేపీ కోర్ కమిటీలో కీలక అంశాలపై చర్చ.. మునుగోడు గెలుపు వ్యూహాం ఇదే..

తెలంగాణలో ఎలాగైనా బలపడి వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి అధికారంలోకి రావడం కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆలక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటినుంచే అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో..

Telangana: బీజేపీ కోర్ కమిటీలో కీలక అంశాలపై చర్చ.. మునుగోడు గెలుపు వ్యూహాం ఇదే..
Bandi Sanjay
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 06, 2022 | 6:01 PM

Telangana: తెలంగాణలో ఎలాగైనా బలపడి వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి అధికారంలోకి రావడం కోసం బీజేపీ శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఆలక్ష్యాన్ని చేరుకోవడానికి ఇప్పటినుంచే అన్ని రకాల అవకాశాలను ఉపయోగించుకోవాలని చూస్తోంది. వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తోంది. మరోవైపు త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో.. ఫస్ట్ మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధించి.. అదే ఊపుతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేలా బీజేపీ వ్యూహాం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలో గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనేదానిపై బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ శాఖకు దిశానిర్ధేశం చేసింది. ఈక్రమంలో బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్ లో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో ప్రధానంగా మునుగోడు ఉప ఎన్నికపైనే చర్చ జరిగింది. మునుగోడులో ఉప ఎన్నిక రావడం తథ్యం కావడంతో.. గెలుపు కోసం ఎలా ముందుకెళ్లాలనే దానిపై బండి సంజయ్ చర్చించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించి మునుగోడు ఉప ఎన్నిక కమిటీ వేయాలని నిర్ణయించినట్లె తెలుస్తోంది.

ఈనెల 11వ తేదీన బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ మునుగోడు వెళ్లనున్నారు. ఈసందర్భంగా నియోజకవర్గంలో ప్రచారంతో పాటు.. సభ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపాలని సమావేశంలో నిర్ణయించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవానికి రెండు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 15వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి అసెంబ్లీ వద్ద ఉన్న సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడంపై కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 17వ తేదీ నుంచి గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2వరకు బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలోని ప్రతి మండలంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే