Beauty Tips: చుండ్రు తేలిగ్గా వదిలిపోవాలంటే వారానికి 2 సార్లు ఇలా చేయండి..
ఈ రోజుల్లో చుండ్రు సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. చుండ్రు వల్ల తరచూ దురద వేధిస్తోంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ముఖం, భుజాలపై మొటిమలు వస్తాయి. ఐతే చండ్రును వదిలించుకోవడానికి ప్రతి ఒక్కరూ వివిధ పద్ధతులను..
How to get rid of dandruff: ఈ రోజుల్లో చుండ్రు సమస్య ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తోంది. చుండ్రు వల్ల తరచూ దురద వేధిస్తోంది. దీనికి సకాలంలో చికిత్స చేయకపోతే ముఖం, భుజాలపై మొటిమలు వస్తాయి. ఐతే చండ్రును వదిలించుకోవడానికి ప్రతి ఒక్కరూ వివిధ పద్ధతులను అవలంభిస్తుంటారు. మార్కెట్లో దొరికే ప్రొడక్ట్‌ల కంటే ఇంట్లో తయారుచేసిన హెయిర్ మాస్క్‌లు జుట్టుకు లోతైన పోషణను అందించడమేకాకుండా చుండ్రును కూడా వదిలిస్తాయి. ఇంట్లో దొరికే పదార్ధాలతో సులభంగా తయారు చేసుకునే కొన్ని హెయిర్ మాస్క్‌లు మీకోసం..
కొబ్బరి నూనె- మెంతుల హెయిర్ మాస్క్ ముందుగా ఓ గిన్నెలో కొన్ని మెంతులను తీసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం ఈ మెంతిగింజనలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌లో 2 లేదా 3 చెంచాల కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని మాడుకు, వెంట్రుకలకు అప్లై చేసుకోవాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి 1 లేదా 2 సార్లు ఉపయోగిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
వేప నూనె – నిమ్మరసం హెయిర్ మాస్క్ గిన్నెలో 2 నుంచి 3 చెంచాల వేపనూనె తీసుకుని, దానికి నిమ్మరసం జోడించి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. ఆ తర్వాత కాసేపు మసాజ్ చేసుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల వరకు అలాగే ఉంచుకుని ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికి 1 నుంచి 2 సార్లు చేయాలి.
ఆలివ్ ఆయిల్ – పెరుగు హెయిర్ మాస్క్ గిన్నెలో అర కప్పు పెరుగు తీసుకుని.. దానికి 1 నుంచి 2 టీస్పూన్ల ఆలివ్ ఆయిల్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలలోని మాడుకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. తర్వత జుట్టును వదులుగా ఉండే బన్‌లో ఉంచి, షవర్ క్యాప్ పెట్టుకోవాలి. 30 నుంచి 40 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును కడగాలి. దీనిని కూడా వారానికి 1 నుంచి 2 సార్లు చేయాలి.
అలోవెరా – టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ హెయిర్ మాస్క్ గిన్నెలో 1 నుంచి 2 స్పూన్ల కలబంద జెల్ తీసుకుని, దీనికి 8 నుండి 10 చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ జోడించాలి. ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గంట తర్వాత తేలికపాటి షాంపూతో స్నానం చేయాలి.