ICFRE Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు పొందే అవకాశం.. రాత పరీకలేకుండానే ఎంపిక..
భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE)కు చెందిన కోయంబత్తూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (IFGTB)లో.. తాత్కాలిక ప్రాతిపదికన..
ICFRE-IFGTB Coimbatore Recruitment 2022: భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వ శాఖ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE)కు చెందిన కోయంబత్తూర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ జెనిటిక్స్ అండ్ ట్రీ బ్రీడింగ్ (IFGTB)లో.. తాత్కాలిక ప్రాతిపదికన 16 రీసెర్చ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్/డిగ్రీ/బీఎస్సీ/పీజీ/ఎంఎస్సీ/ఎంటెక్/మాస్టర్స్ డిగ్రీ/డాక్టోరల్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 25 నుంచి 40 యేళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు సెస్టెంబర్ 19, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. షార్ట్ లిస్ట్ చేసిన వారిని సెస్టెంబర్ 27, 2022వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు. ఇంటర్వ్యూలో ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.15,000 నుంచి రూ.42,000 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఖాళీల వివరాలు..
- సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 1
- సీనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టులు: 3
- ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టులు: 2
- సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టులు: 2
- జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో పోస్టులు: 5
- ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు: 2
- ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు: 1
అడ్రస్: Institute of Forest Genetics and Breeding, RS Puram, Coimbatore, Tamil Nadu.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.