AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coffee Day: భారీగా తగ్గిన కాఫీడే అప్పులు! నా భర్త అప్పులను నేనే తీరుస్తానన్న సిద్ధార్ధ భార్య శపదం నెరవేరినట్లే..

దేశంలో అతిపెద్ద కాఫీ రిటైల్ మార్కెట్ కేఫ్ కాఫీ డే కంపెనీ సీఈవోగా మాళవికా హెగ్డే కొనసాగుతున్న విషయం తెలిసిందే. భర్త మరణం నాటికి కంపెనీ అప్పులు దాదాపు రూ.7214 కోట్లు ఉండగా ప్రస్తుతం..

Coffee Day: భారీగా తగ్గిన కాఫీడే అప్పులు! నా భర్త అప్పులను నేనే తీరుస్తానన్న సిద్ధార్ధ భార్య శపదం నెరవేరినట్లే..
Coffee Day
Srilakshmi C
|

Updated on: Sep 01, 2022 | 7:56 PM

Share

Coffee Day Enterprises Ltd: దేశంలో అతిపెద్ద కాఫీ రిటైల్ మార్కెట్ కేఫ్ కాఫీ డేను స్థాపించిన సిద్ధార్థ్ జూలై 31, 2019 న మంగళూరులో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. వ్యాపారంలో భారీ నష్టం రావడంతో సిద్ధార్ధ్‌ మరణించినట్లు అప్పట్లో వార్తాకథనాలు వెలువడ్డాయి. సిద్ధార్థ్ మరణానంతరం అతని భార్య అయిన మాళవికా హెగ్డే తన భర్త అప్పులను తానే తీరుస్తానని ప్రకటించడమేకాకుండా బెంగళూరులోని కాఫీ డే మెయిన్‌ బ్రాంచ్‌ నుంచి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా డిసెంబర్‌ 2020లో బాధ్యతలు కూడా చేపట్టారు. కంపెనీ సీఈవోగా ఆమె ఐదేళ్లపాడు కొనసాగుతారు. భర్త మరణం నాటికి కంపెనీ అప్పులు దాదాపు రూ.7214 కోట్లు. కంపెనీని సమర్థవంతంగా నిర్వహిస్తూ, వేల అప్పుల బాధ్యతను భుజాన వేసుకుని, పట్టుదలతో కాఫీడే కంపెనీకి పూర్వ వైభవం తెచ్చేందుకు మాళవిక హెగ్దే చేసిన కృషి ఊరికేపోలేదు. అవును.. కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (CDEL) అప్పులు 2022, మార్చి 31 నాటికి చాలా మేరకు తగ్గినట్లు కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది.

కంపెనీ అప్పులు ప్రస్తుతం రూ.1810 కోట్లకు చేరినట్లు కంపెనీ తన నివేదికలో తెల్పింది. ఏటేటా కంపెనీ ఆప్పులను తగ్గించుకుంటూ వస్తున్న కాఫీ డే ఆదాయం అంతకంతకు పెంచుకుంటూ వస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.25 కోట్ల లాభం నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.35 కోట్లకు అంటే 40% అదాయం పెరిగినట్లు తన నివేదికలో పేర్కొంది. అంటే రూ.496 కోట్ల స్థూల ఆదాయంతో లాభాల బాటలో కంపెనీ ముందుకెళ్తోంది. కాగా కాఫీ డే కంపెనీకి దేశ వ్యాప్తంగా దాదాపు 158 సిటీల్లో 495 కేఫ్‌ కాఫీ డే ఔట్‌లెట్లు, వర్క్‌ప్లేస్‌లలో 38,810 వెండింగ్ మెషీన్‌లు ఉన్నాయి.