AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nirmala Sitharaman: ప్రతీ ఒక్కరిపై రూ.లక్షా 25 వేల అప్పు.. KCR ప్రభుత్వంపై కేంద్ర మంత్రి నిర్మలమ్మ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వ విధానాలతో మిగులు బడ్జెట్ కాస్తా.. లోటు బడ్జెట్‌గా మారిందంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఉన్న అనుమతిని మించి అప్పులు చేస్తున్నారంటూ నిర్మల పేర్కొన్నారు.

Nirmala Sitharaman: ప్రతీ ఒక్కరిపై రూ.లక్షా 25 వేల అప్పు.. KCR ప్రభుత్వంపై కేంద్ర మంత్రి నిర్మలమ్మ సంచలన వ్యాఖ్యలు
Nirmala Sitharaman
Shaik Madar Saheb
|

Updated on: Sep 01, 2022 | 7:53 PM

Share

Nirmala Sitharaman on Telangana Government : తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో మిగులు బడ్జెట్ కాస్తా.. లోటు బడ్జెట్‌గా మారిందంటూ వ్యాఖ్యానించారు. బడ్జెట్‌లో ఉన్న అనుమతిని మించి అప్పులు చేస్తున్నారంటూ నిర్మల పేర్కొన్నారు. చాలా అప్పులు అసెంబ్లీకి కూడా తెలియండం లేదని, ప్రభుత్వం చేస్తున్న అన్ని అప్పులనూ బడ్జెట్‌లో చూపించడం లేదంటూ ఆర్థికమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రాల అప్పుల గురించి అడిగే అధికారం కేంద్రానికి ఉందన్నారు. కేంద్రం ప్రశ్నిస్తే విమర్శిస్తున్నారు తప్ప సమాధానాల్లేవంటూ నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లాలో గురువారం జరిగిన ఒక సభలో పాల్గొన్న మంత్రి సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర పథకాలకు తెలంగాణ పేర్లు మార్చి వాడుకుంటోందని సాధారణ విమర్శలు మొదలు పెట్టిన నిర్మల.. రాను రాను తెలంగాణ అప్పులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అప్పులు FRBM పరిధి దాటి పోతోందని విమర్శించారు. తెలంగాణలో పుట్టబోయే పిల్లలపైనే తలకు లక్షా పాతికవేలు అప్పు ఉంటోందని తెలిపారు

రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని.. రైతు రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ తీరుతో రైతులు అప్పులపాలయ్యారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రాజెక్టుల పేరుతో అడ్డగోలుగా భూములు లాక్కుంటున్నారని.. భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదన్నారు. కేంద్రం ఇచ్చే పథకాల పేర్లు మార్చి ఇక్కడ అమలు చేస్తున్నారు. 8 ఏళ్లలో ఉపాధిహామీ పథకం కింద తెలంగాణకు రూ.20 వేల కోట్లు ఇచ్చామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతిని కేంద్రం పెద్దలు ఎండగడుతూనే ఉన్నారు. లేటెస్ట్‌గా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వ్యయం లక్షా 20వేల కోట్లు ఎలా పెంచారని ప్రశ్నించారు. పార్లమెంట్‌ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్‌ వెళ్లారు సీతారామన్‌. ఈ క్రమంలోనే ఈ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Follow Us
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
న్యూయార్క్‌లో ఆగస్టు 29న విశ్వ ఐక్యతా వేడుకలు!
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
పిల్లలకు డయేరియా, వాంతులా? ORS తాగిస్తే నయం అవుతుందా..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడమే కష్టం.. హీరోయిన్ ఎమోషనల్..
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
2027 వన్డే ప్రపంచకప్ నుంచి మాజీ ఛాంపియన్ టీం ఔట్.. అలా జరిగితేనే
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
డుకాటి నుంచి అదిరిపోయే ఫీచర్లతో స్టన్నింగ్ బైక్
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
1917లో బ్రిటీష్ ప్రభుత్వానికి రూ.35 వేల అప్పు ఇచ్చిన భారతీయుడు!
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
విజయ్ రాజకీయాల్లో సక్సెస్ కావడానికి కారణం అదే..
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 734 ఉద్యోగాలు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ లేదు
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు.. కేంద్రం క్లారిటీ!
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే
క్రీడాకారులకు ఆర్థరైటిస్ షాక్.. సైనా నెహ్వాల్ చెప్పిన నిజాలు ఇవే