AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FCI Recruitment: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా ఖాళీలు. అర్హులెవరంటే..

FCI Recruitment: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వివిధ జోన్స్‌లో ఉన్న 5043 పోస్టులను భర్తీ చేయనున్నారు...

FCI Recruitment: నిరుద్యోగులకు బంపరాఫర్‌.. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో భారీగా ఖాళీలు. అర్హులెవరంటే..
Fci Jobs
Narender Vaitla
|

Updated on: Sep 03, 2022 | 8:33 AM

Share

FCI Recruitment: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. న్యూఢిల్లీలోని ఈ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వివిధ జోన్స్‌లో ఉన్న 5043 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా కేటగిరీ-3 నాన్ ఎగ్జిక్యూటివ్‌లో భాగంగా మొత్తం 5043 పోస్టులను భర్తీ చేయన్నారు.

* వీటిలో జూనియర్ ఇంజినీర్ (సివిల్ ఇంజినీరింగ్), జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజినీరింగ్), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2, అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్), అసిస్టెంట్ గ్రేడ్-3(అకౌంట్స్‌), అసిస్టెంట్ గ్రేడ్-3(టెక్నికల్), అసిస్టెంట్ గ్రేడ్-3(డిపో), అసిస్టెంట్ గ్రేడ్-3(హిందీ) విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

* ఇక జోన్ల వారీ ఖాళీల విషయానికొస్తే.. నార్త్ జోన్ (2388), సౌత్ జోన్ (989), ఈస్ట్ జోన్ (768), వెస్ట్ జోన్ (713), నార్త్‌ఈస్ట్‌ జోన్ (185) ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును అనుసరించి డిగ్రీ, బీకాం, బీఎస్సీ (అగ్రికల్చర్/ బోటనీ/ జువాలజీ/ బయో-టెక్నాలజీ/ బయో-కెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఫుడ్ సైన్స్), బీఈ, బీటెక్‌ (ఫుడ్ సైన్స్/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్/ బయో-టెక్నాలజీ/ సివిల్), డిప్లొమా (సివిల్/ మెకానికల్)/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఫేజ్‌-1, ఫేజ్‌-1 ఆన్‌లైన్‌ పరీక్ష, స్టెనో పోస్టులకు స్కిల్‌/టైపింగ్ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌లో ఫేజ్‌-1 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

* దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 06-09-2022న మొదలవుతుండగా 05-10-2022తో ముగియనుంది. ఆన్‌లైన్‌ పరీక్షను 2023 జనవరిలో నిర్వహిస్తారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
భౌమ ప్రదోషం.. అప్పుల బాధ తీరాలంటే శివుడికి ఈ వస్తువు సమర్పించండి
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
మోకాళ్ళలో గుజ్జు పెరగాలంటే ఈ ఒక్క పని చేస్తే చాలు..
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
లైవ్‌ షోకు ముందు విషాదం.. దుబాయ్‌లో ప్రముఖ సింగర్ మృతి
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
OTT టాప్‌ ట్రెండింగ్‌లో మలయాళం క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
పూజా మందిరంలో ఈ తప్పులు చేస్తున్నారా? ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ..
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
క్షణాల్లో మంటల్లో కాలిబూడిదైన కారు..!
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈరోజు బంగారంలో రూ. 50,000 పెడితే 2030 నాటికి ఎంత లాభం వస్తుంది?
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఈశ్వర సాయిని అరెస్ట్ చేయరేంటీ.. ? మరోసారి పోలీస్ స్టేషన్‏కు మాధుర
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
ఆరంభమే అదిరింది.. క్లయిమాక్స్‌ దాకా లెట్స్ డూ కుమ్ముడేనా..?
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..
పోలాల అమావాస్య ఎప్పుడు..? సంతానం, సౌభాగ్యం కోసం పాటించాల్సిన..