BEL Recruitment 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్నారా? భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో రూ.లక్షకుపైగా జీతంతో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనున్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Ghaziabad).. సీనియర్‌ ఇంజినీర్‌, డిప్యూటీ మేనేజర్‌ (Senior Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన..

BEL Recruitment 2022: బీటెక్‌ చేసి ఖాళీగా ఉన్నారా? భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో రూ.లక్షకుపైగా జీతంతో ఉద్యోగాలు..
BEL Machilipatnam Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 01, 2022 | 6:09 PM

BEL Ghaziabad Deputy Manager Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోనున్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (BEL Ghaziabad).. సీనియర్‌ ఇంజినీర్‌, డిప్యూటీ మేనేజర్‌ (Senior Engineer Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టులను బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో (ఎలక్ట్రానిక్స్‌) బీఈ/బీటెక్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత పనిలో కనీసం 4 నుంచి 8 యేళ్ల అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 32 నుంచి 36 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్ 22, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.690లు అప్లికేషన్‌ ఫీజు తప్పనినసరిగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.50,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిపికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.